Langya virus : వామ్మో.. చైనాలో మరో కొత్త వ్యాధి.. 35 మందికి సోకిన లాంగ్యా వైరస్..

By team teluguFirst Published Aug 10, 2022, 11:03 AM IST
Highlights

చైనాలో మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. లాంగ్యా వైరస్ అని పిలుస్తున్న ఈ వ్యాధి ఇప్పటి వరకు 35 మందికి నిర్ధారణ అయ్యింది. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి సేకరించిన నమూనాల్లో ఇది బయటపడింది.

కోవిడ్ -19 ఇంకా పూర్తిగా అంత‌రించిపోక‌ముందే ఇటీవ‌ల మంకీపాక్స్ వైర‌స్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులు పెరుగ‌ద‌ల ఆందోళ‌న క‌లిగిస్తున్న స‌మ‌యంలో చైనాలో మ‌రో కొత్త వైర‌స్ ను గుర్తించారు. దీనిని లాంగ్యా వైర‌స్ లేదా హెనిపా వైర‌స్ (LayV) అని పిలుస్తున్నారు. తూర్పు చైనాలోని హెనాన్, షాన్‌డాంగ్ ప్రావిన్సులలో ఇప్పటి వ‌రకు 35 మందికి ఈ వైర‌స్ సోకిన‌ట్టు ఆ దేశ అధికారిక మీడియా మంగళవారం నివేదించింది.

Viral: గుడిలో చోరీ చేయడానికి వచ్చి... అమ్మవారిని నమస్కరించి...!

ఇప్పటి వరకు జంతువులలో మాత్ర‌మే క‌నిపించిన తాజాగా మ‌నుషుల్లో వెలుగు చూసింది. జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న కొంద‌రి గొంతులో నుంచి సేక‌రించిన న‌మూనాల్లో ఇది నిర్ధార‌ణ అయ్యింద‌ని ప్రభుత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే గ్లోబల్ టైమ్స్ మీడియా నివేదించింది.  జంతువుల నుండి వచ్చిన ఈ కొత్త హెనిపా వైరస్ కొన్ని జ్వర సంబంధమైన కేసులతో సంబంధం కలిగి ఉందని పేర్కొంది. ఇది సోకిన వ్యక్తులలో జ్వరం, అలసట, దగ్గు, అనోరెక్సియా, మైయాల్జియా వికారం వంటి లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ వైర‌స్ కు ప్ర‌స్తుతం వ్యాక్సిన్ లేదా చికిత్స లేదు. అయితే తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డానికి చికిత్స మాత్ర‌మే అందుబాటులో ఉంది. లాంగ్యా హెనిపా వైరస్ కేసులు ఇప్పటి వరకు అయితే ప్రాణాంతకం కాదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని దీనిపై అధ్యయనంలో పాల్గొన్న డ్యూక్-ఎన్‌యుఎస్ మెడికల్ స్కూల్‌లోని ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రోగ్రామ్‌లో ప్రొఫెసర్ వాంగ్ లిన్ఫా చెప్పారు. ప్రకృతిలో ఉనికిలో ఉన్న అనేక వైరస్‌లు మానవులకు సోకినప్పుడు అవి అనూహ్య ఫలితాలను క‌లిగిస్తాయి కాబ‌ట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. 

Heavy rain alert: ప‌లు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు

ఏమిటి ఈ వైర‌స్ ? 
ఇది జంతువుల‌లో ఉండే వైర‌స్. కాగా లాంగ్యా వైరస్ 2019 లో మొదటిసారిగా మానవులలో కనిపించింది. అయితే ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందో లేదో అనే విష‌యం తెలుసుకోవ‌డానికి చైనా నిపుణులు ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. 

బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడెమియాలజీ నేతృత్వంలోని పరిశోధనలో 2020 జనవరి-జూలై 2020 మధ్య క‌రోనా మ‌హ‌మ్మారి ఉన్న సంవత్సరంలో లాంగ్యా వైరస్ ఇన్ఫెక్షన్లు ఏవీ న‌మోదు కాలేద‌ని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే 2020 జూలైలో మ‌రో 11 లాంగ్యా వైరస్ కేసులు న‌మోదు అయ్యాయి. కాగా రోగులలో వైరస్ లక్షణాలను ట్రాక్ చేసిన త‌రువాత ఇది అత్యంత సాధారణమైన‌ జ్వరం లాంటిద‌ని ప‌రిశోధకులు కనుగొన్నారు. ఈ వైర‌స్ ల‌క్ష‌ణాల్లో దగ్గు (50 శాతం), అలసట (54 శాతం), ఆకలి లేకపోవడం (50 శాతం), కండరాల నొప్పులు (46 శాతం), వాంతులు చేసే ధోరణి (38 శాతం) ఉన్నాయి.

Srikant Tyagi case : ఆ మ‌హిళ నాకు సోదరి లాంటిది - బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి

సాధారణంగా గబ్బిలాలలో కనిపించే ప్రాణాంతక నిపా వైరస్ లాంగ్యా ఒకే కుటుంబానికి చెందినది. నిపా కోవిడ్-19 వంటి శ్వాసకోశ బిందువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. అయితే నిపా వైర‌స్ మానవులలో మూడొంతుల మందిని చంపేస్తుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపానే త‌రువాతి మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 
 

click me!