టర్కీలో 4.4 తీవ్రతతో మరో భూకంపం...

By SumaBala BukkaFirst Published Mar 18, 2023, 1:20 PM IST
Highlights

టర్కీని భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపంనుంచి తేరుకోకముందే శనివారం మరో భూకంపం టర్కీని తాకింది.  

ఇస్తాంబుల్ : యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం టర్కీలోని గోక్సన్ జిల్లాకు నైరుతి దిశలో 6 కి.మీ దూరంలో శనివారం 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 7 కిలోమీటర్ల లోతులో వరుసగా 37.974 N,  36.448 E గా ఉన్నట్టు గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం ఉదయం 5.30గం.లకి సంభవించింది.

ఇప్పటి వరకు భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన నష్టం నుంచి టర్కీ ఇంకా కోలుకోలేదు. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 4.17 గంటలకు దక్షిణ టర్కీలో రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో విధ్వంసకర భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం కహ్రామన్‌మారాస్ ప్రావిన్స్‌లోని పజార్సిక్ జిల్లాలో ఉంది.

భూకంపం పొరుగు ప్రావిన్సులైన అడియామాన్, హటే, కహ్రామన్మరాస్, కిలిస్, ఉస్మానియే, గాజియాంటెప్, మలత్యా, సాన్లియుర్ఫా, దియార్‌బాకిర్, ఎలాజిగ్  అదానాలను ప్రభావితం చేసింది, ఇక్కడ సుమారు 1.8 మిలియన్ల మంది సిరియన్ శరణార్థులతో సహా 14 మిలియన్ల మంది నివసిస్తున్నారు.

రెండేళ్ల నిషేధం తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్స్ పునరుద్ధరణ.. మొదటి పోస్ట్ ఏంటంటే..

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 6 తరువాత ఫిబ్రవరి 13న టర్కీలో మరో భూకంపం సంభవించింది. ఈ తాజా భూకంపం టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు దక్షిణ-తూర్పుకి 24 కి.మీ దూరంలో 4.7 తీవ్రతతో సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. ఇప్పటికే అంతకు ముందువారం సంభవించిన భూకంపంతో దేశంలోని అనేక నగరాలను శిథిలాలుగా మారాయి. ఆ తరువాత వచ్చిన ఈ  భూకంపం 15.7 కి.మీ లోతులో సంభవించినట్లు యూఎస్జీఎస్ సమాచారం ఇచ్చింది. భూకంపం 00:03:15 (UTC+05:30)కి సంభవించిందని కూడా ఏజెన్సీ తెలియజేసింది.

టర్కీలో సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, పదేపదే సంభవిస్తున్న ఈ  భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 33,000 కు పెరిగిందని, శిథిలాల కింద ఉన్న వారందర్నీ రక్షిస్తామనే ఆశలు రోజురోజుకూ తగ్గుతున్నాయని తెలియజేసారు. గతవారం సంభవించిన.. టర్కీని ఛిన్నాభిన్నం చేసిన భూకంపం, రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువ రికార్డును నమోదు చేసింది. ఈ భూకంపం, 1939 తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం.

click me!