అమెరికాలో డెన్వర్ నగరంలో ఓ మహిళ తనను బార్‌లోపలికి అనుమతించడం లేదని గన్ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. అనంతరం ఆ మహిళ స్పాట్ నుంచి పారిపోయింది. పోలీసులు ఆమె కోసం గాలింపులు జరుపుతున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనను బార్‌లోకి రానివ్వలేదని గన్ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో డెన్వర్ నగరంలోని రద్దీగా ఉన్న ఓ బార్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితురాలు బార్ ఎదుట క్యూలో నిలబడి ఉన్నది. అయితే, అధికారులు ఆమెను లోనికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె క్యూ నుంచి బయటకు వచ్చి గన్ తీసి కాల్పులు జరిపింది. ఐదుగురు గాయపడ్డారు. ఆ ఐదుగురు టార్గెట్ చేసి షూట్ చేయలేదని తెలిసింది. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి పారిపోయింది. ప్రస్తుతం డెన్వర్ పోలీసులు ఆమెను గాలిస్తున్నారు.
అధికారుల అందించిన వివరాల ప్రకారం, ఆమె లోనికి వెళ్లడానికి అనుమతి నిరాకరించిన సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని షూట్ చేసి ఉండొచ్చని చెప్పారు. ఆమె వేరే వ్యక్తి ఐడీని కలిగి ఉన్నట్టు గమనించిన సెక్యూరిటీ గార్డులు ఆమెను లోనికి అనుమతించలేదు.
Also Read: Karnataka : ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీఎస్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన
దీంతో బార్ లోపల కూడా అలజడి రేగింది. బయట క్యూలో ఉన్నవారు పరుగులు పెట్టారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ వెనుక ఉన్నవాళ్లూ, తమ ముందు ఉన్నవాళ్లూ గాయపడ్డారని ఓ మహిళ చెప్పింది. తాను, తన ఫ్రెండ్స్ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేవని తెలిపింది.