బాయ్ ఫ్రెండ్‌కు వీడియో కాల్‌ చేస్తే, వేరే యువతి లిఫ్ట్ చేసింది.. ఆగ్రహంతో ఆయన ఇంటిని తగులబెట్టిన గర్ల్‌ఫ్రెండ్

By Mahesh KFirst Published Nov 24, 2022, 12:50 PM IST
Highlights

బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేయగా.. ఆయనకు బదులు మరో యువతి ఆ వీడియో కాల్ యాక్సెప్ట్ చేసింది. దీంతో జెలసీతో రగిలిపోయిన ఆ గర్ల్‌ఫ్రెండ్ అర్ధరాత్రే ఇంటికి వెళ్లి ఇల్లు కాలబెట్టింది. కాలిపోతున్న ఇంటిని కూడా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి చూపించింది.
 

న్యూఢిల్లీ: ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు కాల్ చేసింది. ఆ కాల్ మరో యువతి లిఫ్ట్ చేయడంతో ఆమె జెలసీతో రగిలిపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఆ ఇంటిని తగులబెట్టింది. ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌కు వీడియో కాల్ చేసి కాలిపోతున్న ఇంటిని చూపించింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది.

సెనైదా మేరీ సోతో అనే 23 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫేస్‌టైమ్ యాప్ ద్వారా వీడియో కాల్ చేసింది. కానీ, ఆ వీడియో కాల్‌ను బాయ్‌ఫ్రెండ్ కాకుండా మరో యువతి లిఫ్ట్ చేసింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి చొరబడి కొన్ని వస్తువులను బయట వేసింది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ పడుకునే బెడ్ రూమ్‌కు నిప్పు పెట్టింది. ఆ నిప్పు దావానలంలా మారి ఇంటి మొత్తానికి చుట్టింది.

బెక్సార్ కౌంటీ షెరీఫ్ ఆఫీసర్ ఈ మేరకు తెలిపారు. సొతో తన బాయ్‌ఫ్రెండ్‌కు ఫేస్‌టైమ్ వీడియో కాల్ చేసిందని వివరించారు. అయితే, ఆ వీడియో కాల్‌ను మరో మహిళ లిఫ్ట్ చేసిందని, ఆ మహిళ అతని బంధువు అని తేలిందని తెలిపారు.

Also Read: ఓయో హోటల్‌లో ప్రియురాలిని కాల్చి చంపి.. అంతటితో ఆగకుండా..

ఆ ఇల్లు మొత్తానికి నిప్పు అంటుకున్నప్పుడు ఆమె అదంతా రికార్డ్ చేసిందని ఆయన చెప్పారు. ఆ నిప్పు ఇల్లు అంతా చుట్టి 50 వేల అమెరికన్ డాలర్ల వరకు నష్టాన్ని చేకూర్చుందని వివరించారు. ఆ తర్వాత మళ్లీ తన బాయ్‌ఫ్రెండ్ కు ఆమె ఫేస్‌టైమ్ యాప్‌లో వీడియో కాల్ చేసిననట్టు కేశ్యాట్ అనే మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. ఆ ఇంటిలో కాలిపోతున్న ఓ కుర్చీని చూపెట్టిందని వివరించింది. నీ వస్తువులను భద్రంగా ఉంటాయని ఆశిస్తున్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొని కాల్ కట్ చేసింది.

సెనైదా సొతోను అరెస్టు చేయాలని బీసీఎస్‌వో రెండు అరెస్టు వారంట్లను జారీ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారంనాడు సోతోన పోలీసులు అరెస్టు చేశారు.

click me!