పాకిస్థాన్ కు అమెరికా వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Feb 28, 2019, 9:57 AM IST
Highlights

ఇప్పటికే భారత్- పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మసూద్ అజర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రపంచ దేశాలు పాకిస్థాన్ ను ఆదేశించాయి. ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. 
 
వాషింగ్టన్: పాకిస్థాన్ పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మసూద్ అజర్ కు సంబంధించి ఆస్తులను సీజ్ చెయ్యాలని కోరింది. 

మరోవైపు పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులను సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం పెట్టనుంది. పీఓకేలో ఉగ్ర శిబిరాలపై భారత్ తాడులను అమెరికాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్ లు సమర్థించాయి. 

ఇప్పటికే భారత్- పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మసూద్ అజర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ప్రపంచ దేశాలు పాకిస్థాన్ ను ఆదేశించాయి. ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. 

ఇకపోతే భారత్ పాకిస్థాన్ సరిహద్దులు వార్ జోన్ గా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ కు అమెరికా పలు సూచనలు చేసింది. భారత్ తో యుద్ధం రాకుండా ఉండేందుకు పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. 

click me!