అమెరికా ప్రతీకారం?.. డ్రోన్ దాడిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ హతం

Published : Oct 23, 2021, 02:13 PM ISTUpdated : Oct 23, 2021, 02:16 PM IST
అమెరికా ప్రతీకారం?.. డ్రోన్ దాడిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ హతం

సారాంశం

అల్ ఖైదా ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకారం తీర్చుకున్నది. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్టుపై ఇటీవల అల్ ఖైదా దాడి చేసింది. ఈ దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా సైన్యం డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో అల్ ఖైదా సీనియర్ లీడర్ అబ్దుల్ హమీద్ అల్ మతర్‌ను మట్టుబెట్టినట్టు అమెరికా ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్‌బీ శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.  

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రముప్పు ఇంకా ముగియలేదు. ఒకవైపు ఐఎస్ఐఎస్ మరో వైపు అల్ ఖైదా... ప్రపంచంలో ఏ మూలన ఎప్పుడు ఏ విధ్వంసానికి పాల్పడుతారో తెలియని పరిస్థితి నెలకొని ఉన్నది. సిరియాలో ఈ రెండు ఉగ్రవాద సంస్థలు బలంగా వేళ్లూనుకున్నాయి. ఇప్పుడు అక్కడి నుంచే విదేశాల్లో కుట్రలకు ప్లాన్ చేస్తున్నట్టు అమెరికా భావిస్తున్నది. కాగా, సిరియాలో యుద్ధవాతావరణం ఇంకా ముగియలేదు. 2011 నుంచి జరుగుతున్న దాడి.. ప్రతిదాడుల్లో ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల మంది మరణించారు. Syria మానవ సంక్షోభానికి కేంద్రంగా మారింది. తాజాగా, America ఈ దేశంలోనే మరో Drone దాడి చేసి ఓ సీనియర్ Al Qaeda నేతను హతమార్చింది.

సిరియాలో జరిపిన డ్రోన్ దాడిలో సీనియర్ అల్ ఖైదా నేత అబ్దుల్ హమీద్ అల్ మతర్‌ను అమెరికా మిలిటరీ హతమార్చినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి శుక్రవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. అమెరికా పౌరులను, అమెరికా మిత్రపక్షాలను, అమాయక పౌరులను లక్ష్యం చేసుకుని అంతర్జాతీయ దాడులకు, కుట్రలకు పాల్పడే ఉగ్రవాద సంస్థ సామర్థ్యాన్ని కొంతమేరకు క్షీణించగలిగామని యూఎస్ ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్‌బీ పేర్కొన్నారు. అమెరికా సహా దాని మిత్రపక్షాల దేశాలకు అల్ ఖైదా ఇప్పటికీ అనేక మార్గాల్లో ముప్పును కలుగజేస్తున్నదని వివరించారు. ఆ ఉగ్రవాద సంస్థ బలోపేతం కావడం, దాని నెట్‌వర్క్‌ను సమన్వయం  చేసుకోవడానికి, విదేశాల్లోని ప్రతినిధులనూ సమన్వయం చేసుకోవడానికి, ఉగ్రకుట్రలకు Plan చేయడానికి సిరియాను ఒక కేంద్రంగా వినియోగించుకుంటున్నదని తెలిపారు. తాము జరిగిప డ్రోన్ Attackలో ఇతరులెవరూ మరణించలేదని స్పష్టం చేశారు. ఎంక్యూ-9 ఎయిర్ క్రాఫ్ట్‌తో ఈ దాడి జరిపినట్టు వివరించారు.

Also Read: టెర్రరిస్ట్ వర్సెస్ టెర్రరిస్ట్: అల్ ఖైదా జవహిరి వీడియోపై ఐఎస్ఐఎస్ ప్రశ్నలు

యూఎస్ సారథ్యంలని సంకీర్ణ సేనలు వినియోగించుకున్న దక్షిణ సిరియాలోని ఓ ఔట్‌పోస్టుపై ఇటీవలే అల్ ఖైదా దాడి చేసి పేల్చేసింది. ఈ దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే అమెరికా తాజా డ్రోన్ దాడి నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే అల్ ఖైదాపై ఈ డ్రోన్ దాడిని ప్రతీకారంగానే చూడాలా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. అమెరికా ప్రతీకారదాడికే పాల్పడిందని కొందరు వాదిస్తున్నారు. అయితే, దీనిపై రిగ్స్‌బీ స్పందించలేదు.

Also Read: ‘అమెరికాపై అల్ ఖైదా మరోసారి దాడి చేయవచ్చు.. అఫ్ఘాన్‌లో బలపడానికి ప్రయత్నాలు చేస్తున్నది’

ఉగ్రవాదుల స్వాధీనంలో ఉన్న వాయవ్య సిరియాలోనూ సెప్టెంబర్‌లో అమెరికా సేలను దాడులు జరిపాయి. ఈ దాడుల్లోనూ అల్ ఖైదా ఇంకో సీనియర్ నేత సలీమ్ అబు అహ్మద్‌ను హతమార్చాయి. అప్పటి దాడి ఇడ్లిబ్‌లోని గవర్నేట్ సమీపంలోనే అమెరికా చేపట్టింది. ఇడ్లిబ్‌లోని చాలా ప్రాంతం, అలెప్పోలు ఒకప్పటి అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ స్వాధీనంలో ఉన్నాయి.

ఇప్పటికీ సిరియాలో యుద్ధ బీభత్సం జరుగుతూనే ఉన్నది. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్, ఇతర అనుబంధ ఉగ్రవాద గ్రూపులు కొంత భూభాగాన్ని చేజిక్కించుకుని ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ పాలన సాగడం లేదు. ఈ ఉగ్రముఠాలకు సిరియా ప్రభుత్వ సైన్యం, అమెరికా సారథ్యంలోని సంకీర్ణ సేనల మధ్య యుద్ధం జరుగుతున్నది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?