పాకిస్తాన్‌ను అల్లాహ్‌ సృష్టించాడు.. అందుకే ఆయనే అభివృద్ధి కూడా చేస్తాడు: పాకిస్తాన్ ఆర్థిక మంత్రి సంచలనం

By Mahesh KFirst Published Jan 28, 2023, 2:40 AM IST
Highlights

పాకిస్తాన్ దేశాన్ని ఆ దేవుడు సృష్టించినప్పుడు ఆ దేవుడే దాన్ని కాపాడుతాడని, అభివృద్ధి చేస్తాడని, సుసంపన్నం గావిస్తాడని ఆ దేశ ఆర్థిక మంత్రి పేర్కొన్నాడు. ప్రపంచంలో ఇస్లాం పేరిట ఏర్పడిన ఏకైక దేశం పాకిస్తాన్ అని పేర్కొంది.
 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషక్ దార్ మాట్లాడుతూ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన ఆర్థిక మంత్రి తన బాధ్యతలను, జవాబుదారీతనాన్ని గట్టు మీద పెడుతున్నట్టు వ్యవహరించారు. పాకిస్తాన్ ఇస్లాం పేరిట ఏర్పడిన ఏకైక దేశం అని, అందుకే ఈ దేశ అభివృద్ధికి, సుభిక్షతకు ఆ అల్లాహ్‌నే బాధ్యుడు అని పేర్కొన్నారు.

ఇస్లామాబాద్‌లో గ్రీన్ లైన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీస్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సీనియర్ నేత ఇషక్ దార్ అన్నారు. పాకిస్తాన్‌ను ఇస్లాం పేరిట సృష్టించారు కాబట్టి, అది అభివృద్ధి చెంది తీరుతుందని తెలిపారు.

అల్లా పాకిస్తాన్ దేశాన్నే సృష్టించినప్పుడు ఆయన ఈ దేశాన్ని రక్షించగలడని, అభివృద్ధి చేయగలడని, సుసంపన్నం చేయగలడని అన్నారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలో పాకిస్తాన్ కండీషన్ మెరుగు పరచడానికి తాము శాయ శక్తులా ప్రయత్నిస్తున్నామని వివరించారు. కాగా, తమ ప్రభుత్వ రాత్రింబవళ్లు పని చేస్తున్నదని, దేశం ప్రస్తుతం ఈ దుర్భర పరిస్థితులకు దిగజారడానికి కారణం మాత్రం గతంలోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వమే అని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతోనే ఈ ప్రభుత్వానికి అనేక సమస్యటు బట్వాడా అయ్యాయని వివరించారు.

ఎన్నికల ముందే దేశంలో పరిస్థితులను మెరుగుపరచడానికి తమ బృందాలు పని చేస్తున్నాయని వివరించారు. ఐదేళ్ల క్రితం దేశంలో మొదలు పెట్టిన డ్రామా పరిణామాలనే దేశం ఇంకా అనుభవిస్తున్నదని పేర్కొన్నారు. అదే.. 2013, 2017 మధ్య కాలంలో నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం ఆర్థికంగా పుంజుకున్నదని తెలిపారు. 

దక్షిణ ఆసియాలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ బెస్ట్ పర్మార్ఫెన్స్ ఇచ్చిందని, నవాజ్ షరీఫ్ హయాంలో ప్రపంచంలోనే ఐదో ర్యాంకు ఈ పాకిస్తాన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సాధించిందని వివరించారు. 

పాకిస్తాన్ ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పేమెంట్ బ్యాలెన్స్‌ను చెల్లించలేక సతమతం అవుతున్నది. అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే రుణాలపైనా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నది. 

click me!