వుహాన్‌లో కరోనా కేసులు నిల్: రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

By narsimha lode  |  First Published Apr 26, 2020, 6:10 PM IST

కరోనాకు పుట్టినిల్లైన వుహాన్ లో ఒక్క కరోనా రోగి కూడ లేరని చైనా ప్రకటించింది. గత ఏడాది చివర్లో కరోనా వైరస్ ఇదే నగరంలో వెలుగు చూసింది. వుహాన్ నుండి ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. 
 


బీజింగ్: కరోనాకు పుట్టినిల్లైన వుహాన్ లో ఒక్క కరోనా రోగి కూడ లేరని చైనా ప్రకటించింది. గత ఏడాది చివర్లో కరోనా వైరస్ ఇదే నగరంలో వెలుగు చూసింది. వుహాన్ నుండి ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. 

చైనా నుండే ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందింది. వుహాన్ నగరంలోని కరోనా రోగులంతా కోలుకొని తమ ఇళ్లకు చేరుకొన్నారని అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్ 26వ తేదీ వరకు ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 

Latest Videos

 కరోనా కట్టడికి వుహాన్ లోని నగర పాలక సంస్థ , వైద్య సిబ్బంది కృషితోనే కొత్త కేసులు నమోదు కావడం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ అభిప్రాయపడ్డారు.

also read:అమెరికా నిధుల కోత,ముందుకొచ్చిన చైనా : డబ్ల్యుహెచ్ఓకు 30 మిలియన్ డాలర్లు

వుహాన్ నగరంలోనే 46,452 మంది కరోనా బారినపడ్డారు. ఈ వైరస్ బారిన పడిన 3869 మంది మృతి చెందారు. చైనాలో నమోదైన కరోనా కేసుల్లో 56 శాతం, మరణాల్లో 84 శాతం వుహాన్ నగరంలో నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 29 లక్షలకు చేరుకొంది. ఇప్పటికే రెండు లక్షల మంది మృతి చెందారు.

click me!