
Russian Ukraine Crisis: ఉక్రెయిన్ ను ఆక్రమించాలనే కుతంత్రంతో రష్యా నాలుగో రోజు కూడా దాడి చేస్తుంది. ఇప్పటి పలు నగరాలను ధ్వంసం చేయడంతో ఆ దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బలాగాల దాష్టీకంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎటుచూసినా.. బాంబు దాడులతో, వైమానిక దాడులతో భయానక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన మధ్య ఎక్కడ ఆశ్రయం దొరికితే.. అక్కడ తలదాచుకుంటున్నారు ఉక్రెయిన్ దేశస్థులు.
ఇదిలా ఉంటే.. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఉక్రెయిన్ లోని కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీశాయి రష్యాన్ బలాగాలు. ఈ క్రమంలోనే పవర్ గ్రిడ్‌లను, సెల్ టవర్స్ ను పేల్చివేయడం ద్వారా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో తమ సమాచారాన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారికి పంచుకునే వీలు కూడా లేకుండా పోయింది. దీంతో ప్రపంచంతో సంబంధం లేక అనేక ఉక్రెయిన్ నగరాలు భయానక పరిస్థితులలో ఉన్నాయి.
దీంతో శత్రువుల కదలికలపై సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లేక యుక్రెయిన్ సైన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈక్రమంలో.. తమ దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించాలంటూ యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ..ఎలాన్ మాస్క్ విజ్ఞప్తి చేశారు. ఉపప్రధాని విజ్ఞప్తి మేరకు తన స్టార్ లింక్ ప్రాజెక్ట్ ద్వారా యుక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు ఎలాన్ మస్క్.
రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యన్ దాడులను ఎదుర్కొవడానికి శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్‌లను అందించాలని యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ SpaceX అధినేత ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. ఉప ప్రధాని విజ్ఞప్తి మేరకు.. ఎలాన్ మస్క్ తన కంపెనీ SpaceX స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఉక్రెయిన్‌లో యాక్టివేట్ చేశారు.
అంతక ముందు యుక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ట్విట్టర్లో స్పందిస్తూ “మీరు అంగారక గ్రహానికి రాకెట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు వలస రాజ్యం రష్యా.. ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది! మీ రాకెట్లు అంతరిక్షం నుండి విజయవంతంగా ల్యాండ్ అవుతున్నప్పుడు రష్యా రాకెట్లు ఉక్రేనియన్ పౌరులపై దాడి చేస్తాయి! ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ అందించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము” అంటూ ఎలాన్ మస్క్ ను విజ్ఞప్తి చేశారు.
ఫెడోరోవ్ ట్వీట్ కు ఎలాన్ మస్క్ ప్రతిస్పందించాడు. "స్టార్‌లింక్ సేవలు ఇప్పుడు ఉక్రెయిన్‌లో యాక్టివ్‌గా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని టెర్మినల్స్ కూడా అనుసంధానిస్తాం అని ట్వీట్ చేశారు. ఇలా ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు పునర్దించడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఎంతో శక్తివంతమైన స్టార్ లింక్ వ్యవస్థ దాడి చేయాలంటే.. రష్యాకు ఏ మాత్రం సాధ్యం కాదు.
స్టార్‌లింక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న 2,000 కంటే ఎక్కువ ఉపగ్రహాల సముదాయాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ శుక్రవారం మరో 50 స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది. మరెన్నో భూమి యొక్క కక్ష్యలో ఉంచబోతుంది.