పెళ్లిలో భర్త ఎదుటే.. లవర్ ని కౌగిలించుకున్న వధువు..!

Published : Jan 30, 2021, 08:36 AM ISTUpdated : Jan 30, 2021, 08:38 AM IST
పెళ్లిలో భర్త ఎదుటే.. లవర్ ని కౌగిలించుకున్న వధువు..!

సారాంశం

ఆ పెళ్లికి ముందు ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. అయితే.. అనుకోని కారణాల కారణంగా వారిద్దరూ పెళ్లితో ఒక్కటికాలేకపోయారు.  దీంతో.. ఆమె మరో వ్యక్తిని పెళ్లాడుతోంది.

వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. అతిథులంతా ఆ పెళ్లికి హాజరయ్యారు. సడెన్ గా ఆ పెళ్లి మండపంలోకి వధువు.. మాజీ లవర్ ఎంటర్ అయ్యాడు. వచ్చిన లవర్ ని.. ఆ వధువు ప్రేమగా గుండెకు హత్తుకుంది. అది కూడా తన భర్త అనుమతితో చేయడం గమనార్హం. ఈ సంఘటన  ఇండోనేషియాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండోనేషియాకు చెందిన ఓ యువతికి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి ముందు ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. అయితే.. అనుకోని కారణాల కారణంగా వారిద్దరూ పెళ్లితో ఒక్కటికాలేకపోయారు.  దీంతో.. ఆమె మరో వ్యక్తిని పెళ్లాడుతోంది. అయితే.. వీరి పెళ్లికి ఆమె మాజీ ప్రియుడు హాజరు కావడం గమనార్హం.

అలా.. పెళ్లికి హాజరైన ప్రియుడిని ఆమె కౌగిలించుకుంది. అందుకు తన భర్త అనుమతి తీసుకొని మరీ కౌగిలించుకుంది. ఊహించని ఈ సంఘటనకి వరుడు తొలుత షాక్‌ అయినా.. ఒప్పుకుంటాడు. దాంతో వధువు తన మాజీ ప్రియుడిని హత్తుకుంటుంది. ఆ తర్వతా సదరు వ్యక్తి వరుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి.. హగ్‌ చేసుకుని అభినందనలు తెలపుతాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక నెటిజనలు వధువును విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘నీ భర్త ఎంత మంచి వాడైనా.. మరీ ఇలా అతడి ముందే.. తన అనుమతితోనే హగ్‌ చేసుకోవడం దారుణం’’.. ‘‘నీవ్వు అతడి భార్యగా తగవు’’.. ‘‘బ్రో నీ కళ్లు నిజం చేప్తున్నాయి... నీ భార్య ప్రవర్తన నిన్ను బాధపెట్టింది’’.. ‘‘భర్త ముందే మాజీ ప్రియుడ్ని హగ్‌ చేసుకున్నావ్‌.. నీకు అతడంటే ఏ మాత్రం గౌరవం లేదు’’ అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Gold : టీ తాగిన రేటుకే తులం బంగారం.. ఈ దేశం పేరు తెలిస్తే షాక్ అవుతారు !
Coca Cola Formula : 100 ఏళ్ల కోకా కోలా తయారీ సీక్రేట్ లీక్..? ఏకంగా యూట్యూబ్ లో వీడియో