2021లో యాక్సిడెంట్ అయి.. 1993లో కళ్లు తెరిచిన 58యేళ్ల వ్యక్తి.. ఇంతకీ ఏం జరిగిందంటే...

By SumaBala BukkaFirst Published Nov 29, 2022, 1:02 PM IST
Highlights

యాక్సిడెంట్లో 29 యేళ్ల జీవితాన్ని మరిచిపోయాడో.. 58యేళ్ల వ్యక్తి. తన భార్యనే మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. 

అమెరికా : రోడ్డు ప్రమాదాలు జీవితాల్ని తలకిందులు చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని విచిత్రాలు జరగడానికి తోడ్పడతాయి. అలాంటి ఓ విచిత్ర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. నిరుడు ఓ కారు యాక్సిడెంట్ లో బతికి బయటపడిన ఓ వ్యక్తి కోమానుంచి మూడు రోజుల క్రితం బయటికి వచ్చాడు. అయితే అతను తానింకా 1993లోనే ఉన్నానని అనుకుంటున్నారు. అతని వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు.. కానీ తన జీవితంలోని 29 సంవత్సరాలను అతను పూర్తిగా మరిచిపోయాడు. తన ఇద్దరు సొంత కూతుళ్లను గుర్తు పట్టలేదు. అతనికి కేవలం తన భార్య మాత్రమే గుర్తుంది.

కోమానుంచి లేస్తూనే అతను పదే పదే నా భార్య ఏదీ, నా భార్య ఎలా ఉంది.. అంటూ అడగడం మొదలుపెట్టాడు. అసలింతకు ఏం జరిగిందంటే.. వర్జీనియాకు చెందిన క్రిస్టీ, ఆండ్రూ మెకెంజీ జూన్ 2021లో బైక్ మీద వెడుతుంటే ఒక కారు రెడ్ లైట్‌ జంప్ చేసి.. వీరి బైక్ ని గట్టిగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించాల్సిన వారే అదృష్ఠవశాత్లు బతికారు. కారు ఢీ కొట్టగానే వీరిద్దరూ 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. వెంటనే భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ అంతర్గత రక్తస్రావం, ఊపిరితిత్తులు పంక్చర్, ఎముకలు విరిగిపోవడంతో వీరికి శస్త్రచికిత్సలు అవసరం పడ్డాయి.

అయితే, ఆండ్రూ మూడు రోజుల తరువాత ఆసుపత్రిలో మేల్కొన్నప్పుడు, అతను తాను 1993లో ఉన్నానని అనుకున్నాడు. అతని జీవితంలో 29 సంవత్సరాల్లో జరిగినవేవీ గుర్తుకులేదు. తన సొంత కుమార్తెలను కూడా గుర్తించలేదని చెప్పాడు. కానీ 'నా భార్య ఎక్కడ? నా భార్య ఎక్కడ?'  అని మాత్రం పదే పదే కలవరించాడు. దీనిమీద అతని భార్య మాట్లాడుతూ..  నేను ఆసుపత్రిలో పని చేస్తున్నానని అతను అనుకుని ఉంటాడు" అని భార్య తెలిపింది. 

శిశువుగా కిడ్నాప్ చేయబడి, 51 సంవత్సరాల కుటుంబంతో కలిసిన యుఎస్ మహిళ

ఆ ఘటన మీద ఆండ్రూ మాట్లాడుతూ... "నాకు మొదటిగా గుర్తుకు వచ్చింది..  క్రిస్టీ వీల్‌చైర్ బెడ్‌సైడ్‌లో ఉన్న నన్ను నేను చూసుకోవడం గురించి ఆందోళన చెందడం" అని గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో డాక్టర్లు ఆండ్రూ జ్ఞాపకశక్తి ఎప్పటికీ తిరిగి వస్తుందో, ఇక రాదో  చెప్పలేమని చావు కబురు చల్లగా చెప్పారు. అయితే, ఈ వార్త విన్నఅతని భార్య అధైర్యపడలేదు.. తన భర్తను ఆసుపత్రిలో తన గదిలో ఉంచమని సిబ్బందిని ఒప్పించింది. 

అతని జ్ఞాపకశక్తి వెనక్కి రావడానికి ఇది సహాయపడుతుందని అనుకుంది. అనుకున్నట్టుగానే.. "అతను నన్ను విషయాలు అడగడం ప్రారంభించాడు. నేను ఆశ్చర్యపోయాను," అని క్రిస్టీ చెప్పింది. ఆసుపత్రిలో 11 రోజులు గడిపిన తర్వాత, ఆ జంట మెల్లిగా లేచి నడవగలిగారు. ఆ తరువాత వారు ఆగస్టులో ఫ్యామిలీ బీచ్ వెకేషన్ కూడా వెళ్లారు. ఈ పర్యటనలో, ఆండ్రూ రెండవ సారి తన భార్యను విల్ యూ మ్యారీమీ అంటూ కొత్త వ్యక్తిగా అడిగాడు. దీనికి ఆమె అంగీకరించింది. ‘పెళ్లైన 37 సంవత్సరాలు.. నా భార్య మళ్లీ నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది.. నేను అదృష్టవంతుడిని..’ అని ఆండ్రూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన భార్య వల్లే ఇప్పుడు తాను మళ్లీ మనిషినయ్యానని... ప్రమాదంలో ఏదీ తనకు గుర్తు లేదని చెప్పుకొచ్చాడు. 

click me!