కాశ్మీర్‌పై పాక్‌కు మరో షాక్: చీవాట్లు పెట్టిన ఆఫ్గానిస్తాన్

By Siva KodatiFirst Published Aug 19, 2019, 2:00 PM IST
Highlights

జమ్మూకాశ్మీర్ విషయంలో తమ మాట ఎవరు పట్టించుకోవడం లేదని ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో పడిపోయిన పాకిస్తాన్‌ మరో షాక్ తగిలింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అఫ్గాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశ అంబాసిడర్ రోయా రహ్మానీ తేల్చి చెప్పారు. 

అమెరికాకు పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్ ఆఫ్గనిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. కాశ్మీర్‌లో నెలకొన్ని పరిస్థితులు ఆఫ్గన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె ఎద్దేవా చేశారు.

పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ వేలాది మంది సైన్యాన్ని ఎందుకు పెట్టిందో తెలియడం లేదు... మా నుంచి పాకిస్తాన్‌కు ఎటువంటి ముప్పు లేదన్నారు. కానీ పాక్‌లో ఉండే ఉగ్రవాదుల వల్ల తమ దేశానికి తరచుగా ప్రమాదాలు ఎదురువుతున్నాయని రోయా గుర్తు చేశారు.

ఆఫ్గన్‌ వైపు ఉసిగొల్పేలా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇందులో పాక్ పాత్ర లేకపోతే దీని గురించి మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా... ఆర్టికల్ 370 రద్దు ఆఫ్గానిస్తాన్ శాంతి భద్రతలపై ప్రభావం చూపుతుందని పాకిస్తాన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

కాశ్మీర్‌తో పనికాదని...రూటు మార్చిన ఇమ్రాన్ ఖాన్

గూగుల్‌లో బికారి అని టైప్ చేస్తే.. చేతిలో చిప్పతో ఇమ్రాన్

click me!