గూగుల్‌లో బికారి అని టైప్ చేస్తే.. చేతిలో చిప్పతో ఇమ్రాన్

By Siva KodatiFirst Published Aug 19, 2019, 8:25 AM IST
Highlights

గూగుల్ సెర్చ్‌లో ‘‘BHIKARI’’ అని ఎంటర్ చేస్తే ఇమేజ్ రిజల్ట్‌‌లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఇమ్రాన్ ఫోటోలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాటలను కొందరు ట్విట్టర్‌లో పెట్టి పాక్ ప్రధానిని ఆడుకుంటున్నారు. 

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కుతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ నెటిజన్లకు దొరికారు. ఇమ్రాన్‌కు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సామాజికి మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

బికారి గెటప్‌లో చేతిలో బొచ్చె పట్టుకుని ఉన్న ఆయన ఫోటోను కొందరు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది ఎవరో కావాలని చేసింది మాత్రం కాదు.. గూగుల్ సెర్చ్‌లో ‘‘BHIKARI’’ అని ఎంటర్ చేస్తే ఇమేజ్ రిజల్ట్‌‌లో భాగంగా మార్ఫింగ్ చేసిన ఇమ్రాన్ ఫోటోలు వస్తున్నాయి.

దీనికి సంబంధించిన స్క్రీన్ షాటలను కొందరు ట్విట్టర్‌లో పెట్టి పాక్ ప్రధానిని ఆడుకుంటున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గూగుల్‌కు దొరికారు. సెర్చ్ బాక్స్‌లో ఇడియట్ అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటో రావడంతో కలకలం రేగింది.

అలాగే టాయిలెట్ పేపర్ అని టైప్ చేస్తే పాకిస్తాన్ జాతీయ జెండా రావడం పట్ల పాక్ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్ అల్గారిథమ్‌లోని కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. 

click me!