ఆఫ్ఘనిస్థాన్‌కు ప్రాణ సంకటం: ప్రతీ 1000 మందిలో 500 మందికి పాజిటివ్ వచ్చే ఛాన్స్..?

By Siva KodatiFirst Published May 7, 2020, 4:33 PM IST
Highlights

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారినపడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జనాభాలో 80 శాతం మంది కోవిడ్ 19 బారినపడే ప్రమాదం ఉందని అంచనా

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌లో ఉండిపోయాయి. ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలకు సంబంధించిన పరిస్ధితిపై నివేదికలు విడుదల చేస్తోంది.

ఈ క్రమంలో ప్రపంచంలోనే  అత్యధికంగా కరోనా బారినపడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో జనాభాలో 80 శాతం మంది కోవిడ్ 19 బారినపడే ప్రమాదం ఉందని అంచనా.

Also Read:కరోనా వైరస్ పై పరిశోధన... అమెరికాలో చైనా శాస్త్రవేత్త హత్య

3.5 కోట్ల జనాభా కలిగిన ఆఫ్ఘనిస్థాన్‌లో సుమారు 50 లక్షలకు పైగా జనాభా దేశ రాజధాని కాబూల్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంది. అక్కడ 500 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 50 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు తేలిందని ఐవోఎం తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో కరోనా పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలుంది. ఇదే సమయంలో ఉగ్రవాదుల వల్ల దేశంలోని 30 శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేదు.

దీనికి తోడు ఆఫ్ఘన్ల సగటు ఆయుర్దాయం 50 ఏళ్లు మాత్రమే. టీబీ, హెచ్ఐవీ, పోషకాహార లోపం, క్యాన్సర్, గుండె, సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడుస్తున్నాయి. అంతర్యద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాదిమంది పొరుగు దేశాల్లో తలదాచుకుంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

Also Read:లాక్ డౌన్ ఎత్తివేత.. డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరికలు

తాజాగా కరోనా వల్ల శరణార్ధుల్ని తమ సొంత దేశాలకు పంపించడంపై అంతర్జాతీయంగా ఆంక్షలున్నాయి. అయినప్పటికీ ఏ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్‌ల నుంచి దాదాపు 2,71,000 మంది ఆఫ్ఘన్‌కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వ్యాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొంది. కాగా మే 5 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో 2,900 కేసులు నమోదవ్వగా, 90 మంది ప్రాణాలు కోల్పోయారు. 


 

click me!