afghanistan: ఉజ్బెకిస్తాన్‌లో కూలిన ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ విమానం

By telugu teamFirst Published Aug 16, 2021, 6:14 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఘటనను ధ్రువీకరించిన ఉజ్బెకిస్తాన్ రక్షణ శాఖ వివరాలను అధ్యయనం చేసి వెల్లడిస్తామని తెలిపింది.

న్యూఢిల్లీ: పుండు మీద కారం చల్లినట్టు తాలిబన్ల రాజధాని నగరాన్ని ఆక్రమించుకోగానే దేశం నుంచి బయటకు వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ విమానం ఉజ్బెకిస్తాన్‌లో కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలోని సుర్ఖాందర్య రీజియన్‌లో అఫ్ఘాన్ మిలిటరీ విమానం కూలిపోయినట్టు ఉజ్బెకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఆదివారం సాయంత్రం ఈ విమానం కూలిపోయినట్టు ఉజ్బెకిస్తాన్ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. తాజాగా, ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనను ధ్రువీకరించింది. అయితే ఘటనాపరమైన వివరాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. ఆ తర్వాతే ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చెబుతాని పేర్కొంది. 

ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పతనమైన సంగతి తెలిసిందే. తాలిబన్లు రాజధాని నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఈ తరుణంలో అప్పటి అద్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలివెళ్లారు. అదే రోజు సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్ నుంచి 84 సైనికులు సరిహద్దు దాటి ఉజ్బెకిస్తాన్‌లోకి ప్రవేశించి వైద్య సహాయం కోరినట్టు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకున్నట్టు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. 

click me!