త్వరలో ఎన్నికలు... అభ్యర్థి కుర్చీ కింద బాంబు పెట్టి..

By ramya neerukondaFirst Published Oct 17, 2018, 3:25 PM IST
Highlights

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన అబ్దుల్ జబర్ ఖహ్రామన్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు. ఈ దాడిలో  అతను అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్టు స్థానిక మీడియా పేర్కొంది.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...అభ్యర్థి కుర్చీ కింద బాంబు పెట్టి అతనిని హతమార్చిన  సంఘటన కాబూల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఆఫ్ఘనిస్తాన్‌లోని దక్షిణ ప్రావిన్స్ హెల్మండ్‌లో వచ్చే శనివారం ఎన్నికలు జరగనున్నాయి.

కాగా...పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన అబ్దుల్ జబర్ ఖహ్రామన్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు. ఈ దాడిలో  అతను అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనపై హెల్మండ్ గవర్నర్ ఒమర్ జ్వాక్ మాట్లాడుతూ.. ‘‘ఖహ్రామన్ ప్రచార కార్యాలయంలోని ఆయన కుర్చీ కింద బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం..’’ అని వెల్లడించారు.
 
కాగా ఖహ్రామన్‌పై దాడి తమ పనేనని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. పార్లమెంటరీ ఎన్నికలను ఆఫ్ఘాన్ ప్రజలు బహిష్కరించాలని.. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా గత రెండు వారాల్లోనే తాలిబన్లు 10 మంది అభ్యర్థులను పొట్టనబెట్టుకోవడం గమనార్హం. మరో ఇద్దరిని కిడ్నాప్ చేయగా... ఉగ్రవాదుల కాల్పుల్లో అనేక మందికి గాయాలయ్యాయి. గతవారంలో ఓ ఎన్నికల ర్యాలీపై దాడిజరగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 

click me!