గుడ్‌న్యూస్: రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకొంటే మాస్క్ అక్కర్లేదు

By narsimha lodeFirst Published May 14, 2021, 9:46 AM IST
Highlights

అమెరికావాసులకు గుడ్‌న్యూస్ ను చెప్పాడు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్.రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొన్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పర్యటించే సమయంలో  మాస్క్‌లు అవసరం లేదని తేల్చి చెప్పింది. 

వాషింగ్టన్:అమెరికావాసులకు గుడ్‌న్యూస్ ను చెప్పాడు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్.రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొన్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పర్యటించే సమయంలో  మాస్క్‌లు అవసరం లేదని తేల్చి చెప్పింది. గురువారం నాడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  రోజ్ గార్డెన్ వద్ద ప్రసంగించారు.

ఈ కొత్త మార్గదర్శకాలను  గురించి ప్రకటించారు. రెండు డోసులు వేసుకొన్న వారు మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు.  టీకాలు వేసుకొనేవరకు మాస్క్ లు ధరించాలని ఆయన సూచించారు. బస్సులు, విమానాలు, ఆసుపత్రులు, జైళ్లు వంటి ప్రాంతాల్లో మాస్క్ లు ధరించాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. మనమంతా ఈ క్షణం కోసం ఎంతో ఆశపడ్డాం.. మనం కొంత సాధారణ స్థితికి చేరుకోగలిగినట్టుగా సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్క్సీ చెప్పారు.  అమెరికాలో గత ఏడాది సెప్టెంబర్ మాసం నుండి కరోనా కేసులు తగ్గుతున్నాయి. అంతేకాదు కరోనాతో మరణాల రేటు కూడ పడిపోయింది. 

click me!