రిసెప్షన్ అయిన నిమిషాల్లో ప్రమాదం.. వధువు హత్య, విషమస్థితిలో వరుడు..

By SumaBala BukkaFirst Published May 2, 2023, 3:41 PM IST
Highlights

పెళ్లి రిసెప్షన్ నుంచి ఇంటికి వెడుతుండగా ప్రమాదం జరగడంతో ఓ నవ వధువు అక్కడికక్కడే మృతి చెందింది. వరుడు తీవ్ర గాయాలతో ప్రాణాలకోసం పోరాడుతున్నాడు. 

సౌత్ కరోలినా : ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ జంటను మృత్యువు మద్యంమత్తు రూపంలో వెంటాడింది. మద్యం మత్తులో అతి వేగంతో కారు నడపడంతో నవ వధువు మృతి చెందింది. వరుడు తీవ్రగాయాలపాలయ్యాడు. వధువు చనిపోయిన సంగతి కూడా తెలుసుకోలేని స్థితిలో పడిపోయాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 

మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు అతి వేగంతో డ్రైవ్ చేయడంతో అప్పుడే వివాహమైన ఓ కొత్తజంట ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. వధువు మృతి చెందగా, వరుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం అమెరికాలోని సౌత్ కరోలినాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివాహ రిసెప్షన్ నుంచి వారు బయలుదేరిన గోల్ఫ్ కార్ట్ కారును.. ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఓ కారు ఢీకొట్టింది.

షాకింగ్ : తప్పిపోయిన టీనేజర్స్ కోసం వెతుకుతుంటే, దొరికిన 7 మృతదేహాలు..

GoFundMe పేజీలో తెలిపిన వివరాల ప్రకారం... వధువు సమంతా 'సామ్' హచిన్సన్, (34)గా, వరుడిని ఆరిక్ హచిన్సన్‌గా తెలుస్తోంది. క్రాష్‌కు ముందు కొత్త జంట స్పార్క్లర్‌ల కింద నడుస్తున్న ఫోటో కూడా ఇందులో ఉంది. వరుడి తల్లి ఈ పేజీని చూస్తున్నారు. అందులో ఏం రాశారంటే.. కుటుంబ సభ్యులు రిసెప్షన్ నుండి కొత్త జంటను తీసుకువెళుతుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ''గోల్ఫ్ కార్ట్ 100 గజాల దూరం విసిరివేయబడింది. అనేక రౌండ్లు తిరుగుతూ వెళ్లింది’ అని రాసుకొచ్చారు.

ఈ ప్రమాదం వల్ల తన కొడుకు మెదడుకు గాయమైందని, ఎముకలు విరిగిపోయాయని, రెండు పెద్ద ఆపరేషన్లు చేయవలసి వచ్చిందని ఆమె తెలియజేసింది. ఈ ప్రమాదంలో వీరితో పాటు మరో ఇద్దరు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

''సామ్ గాయాలతో మరణించింది. ఆరిక్ విషమ పరిస్థితిలో ఉన్నాడు. రెండు పెద్ద ఆపరేషన్లు.. ఒకటేమో, విరిగిన ఎముకలకు, మరొకటి మెదడు గాయానికి చేశారు. అతను కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. అదే కారులో ఉన్న బెన్, బ్రోగన్‌లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో బెన్ పరిస్థితి విషమంగా ఉంది.'' అని తమకు సాయం చేయండి అంటూ.. వరుడి తల్లి రాసింది. తన కోడలు అంత్యక్రియలకు కొడుకు వైద్య బిల్లులకు ఆర్థిక సహాయంగా కావాలని కోరింది. 

ఈ పేజ్ ద్వారా ఇప్పటికే 385,053 డాలర్ల కంటే ఎక్కువ ఇప్పటికే సేకరించబడ్డాయి. చార్లెస్టన్ కౌంటీ డిటెన్షన్ సెంటర్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్రమాదానికి కారణమైన జామీ కొమోరోస్కి (25) అరెస్టయ్యాడు. అతనిపై మూడు కేసులు నమోదయ్యాయి. 

click me!