మెక్సికోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 15 మంది మృతి, 47 మంది తీవ్ర గాయాలు

Published : Jan 01, 2023, 10:49 AM IST
మెక్సికోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 15 మంది మృతి, 47 మంది తీవ్ర గాయాలు

సారాంశం

Mexico City: మెక్సికోలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 47 మందికి గాయాలు అయ్యాయి. ప్రయాణికులందరూ నయారిట్‌ రాష్ట్రంలోని లియోన్ అనే నగరానికి చెందినవారని సమీపంలోని రాష్ట్ర అధికారులు తెలిపారు.  

Mexico road accident: మెక్సికలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు  బోల్తా కొట్టింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 47 మందికి గాయాలు అయ్యాయి. ప్రయాణికులందరూ నయారిట్‌ రాష్ట్రంలోని లియోన్ అనే నగరానికి చెందినవారని సమీపంలోని రాష్ట్ర అధికారులు తెలిపారు.  ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

ఈ ప్ర‌మాదం గురించి గ్వానాజువాటో రాష్ట్ర అధికారులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మెక్సికోలోని పసిఫిక్ తీర రాష్ట్రమైన నయారిట్‌లోని హైవేపై హాలిడే సీజన్ టూరిస్టులతో ప్రయాణిస్తున్న బస్సు పల్టీలు కొట్టడంతో 15 మంది మరణించారు. 47 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న అధికారులు.. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని అధికారులు తెలిపారు. ప్రయాణీకులందరూ ఆ రాష్ట్రంలోని అదే నగరమైన లియోన్‌కు చెందిన వారని సమీపంలోని గ్వానాజువాటో రాష్ట్ర అధికారులు తెలిపారు. కాగా, ఈ సీజ‌న్ లో మెక్సికోలోని స్నేహితులు, బంధువులు లేదా పొరుగువారు బీచ్ విహారయాత్రల కోసం బస్సు అద్దెకు తీసుకుని వెళ్తుంటారు. ఈ క్ర‌మంలోనే వీరంద‌రూ విహార‌యాత్ర‌కు వెళ్తుండ‌గా, ప్ర‌మాదానిక బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. 

గ్రామీణ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం జరిగిందని నయారిట్‌లోని అధికారులు తెలిపారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. ప్యూర్టో వల్లర్టాకు ఉత్తరాన ఉన్న బీచ్ టౌన్ గుయాబిటోస్ నుండి ప్రయాణికులు తిరిగి వస్తున్నారని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గాయపడిన వారిలో 45 మంది స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కాగా, మెక్సికోలో ఇదివ‌ర‌కు ఇలాంటి ప్ర‌మాదాలు చాలానే చోటుచేసుకున్నాయి. అద్దె బస్సుల నిర్వహణ సరిగా లేకపోవడం, చెడు వాతావరణం లేదా రహదారి పరిస్థితులు లేదా అతివేగం కారణంగా ఇటువంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే