యెమెన్ లో ఘోర విషాదం.. తొక్కిసలాటలో 85 మంది మృతి, వందలాది మందికి గాయాలు

By Asianet NewsFirst Published Apr 20, 2023, 7:46 AM IST
Highlights

యెమన్ లో తొక్కిసాల జరగడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో 80 మందికి పైగా మరణించారు. వందలాది మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అధికారులు హాస్పిటల్ కు తరలించారు. 

యెమన్ రాజధానిలో చారిటీ పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 80 మందికి పైగా మరణించారని, వందలాది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని హుతీ హెల్త్ ఆఫీసర్లు గురువారం వార్తా సంస్థ ‘ఏఎఫ్ పీ’కి తెలిపారు. అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత పేద దేశమైన ఈద్ అల్-ఫితర్ పవిత్ర రంజాన్ మాసం ముగియడానికి కొన్ని రోజుల ముందు తాజా విషాదం చోటు చేసుకుంది.

సల్మాన్ ఖాన్ కు మళ్లీ హత్యా బెదిరింపులు.. ఈ సారి రాఖీ సావంత్ కు కూడా... ‘దూరంగా ఉండండి’ అంటూ మెయిల్..

సనాలోని బాబ్ అల్-యెమెన్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 85 మంది మరణించారని, 322 మందికి పైగా గాయపడ్డారని హుతీ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మరో ఆరోగ్య అధికారి ధ్రువీకరించారు. మృతులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని పేర్కొన్నారు. పంపిణీకి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా.. తమ బంధువుల ఆచూకీ దొరుకుతుందనే ఆశతో ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో భారీగా ఆ ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఇందులో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని హుతి అంతర్గత మంత్రిత్వ శాఖ ఖచ్చితంగా చెప్పారు. కానీ కొంతమంది వ్యాపారులు యాదృచ్ఛికంగా డబ్బు పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగిందని, ఇందులో డజన్ల కొద్దీ మంది మరణించారని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించినది చెప్పుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ పెద్ద కాంప్లెక్స్ లోపల నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసి జనం కేకలు వేస్తున్నారు. 

అతిక్, అష్రఫ్ హత్య కేసు.. ముగ్గురు షూటర్లకు 4 రోజుల కస్టడీ విధించిన ప్రయాగ్ రాజ్ కోర్టు

2014 లో ఇరాన్ మద్దతు గల హుతీ తిరుగుబాటుదారులు సనాను స్వాధీనం చేసుకోవడంతో యెమెన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది, మరుసటి సంవత్సరం సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం జోక్యం చేసుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. గత ఏడాది ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో కుదిరిన ఆరు నెలల కాల్పుల విరమణ గడువు అక్టోబర్ లో ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. కానీ ఈ యుద్ధం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా విషాదంగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది.

ఐక్యరాజ్యసమితి ప్రకారం.. ఆ దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు, వీరిలో హుతి-నియంత్రిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వారికి సంవత్సరాలుగా జీతాలు రావడం లేదు. ఈ సంవత్సరం 21.7 మిలియన్లకు పైగా ప్రజలకు అంటే దేశంలో మూడింట రెండు వంతుల మందికి మానవతా సహాయం అవసరమని యూఎన్ వో పేర్కొంది.

click me!