హమాస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ వైమానిక దళ అధిపతి మురాద్ అబూ మురాద్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం వెల్లడించాయి.
ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య మొదలైన సంక్షోభం తీవ్ర ప్రాణ నష్టాన్ని చేకూరుస్తోంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ఆకస్మిక దాడి చేయడంతో ఇజ్రాయెల్ కూడా యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఈ ఘర్షణలో రెండు వైపులా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. రెండు దేశాలకు చెందిన పౌరులు, సైనికులు చనిపోతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ కు చెందిన కీలకమైన వ్యక్తి మరణించారు.
గాజా స్ట్రిప్ లో శనివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో హమాస్ వైమానిక దళ అధిపతి మురాద్ అబూ మురాద్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం ప్రకటించాయి. ఉగ్రవాద సంస్థ తన వైమానిక కార్యకలాపాలను నిర్వహించే ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది.
: Murad Abu Murad, commander of the Aviation elements of ' military wing was just eliminated by in this building. Under his command, the Para glider riding terrorists of Hamas flew from and landed in Southern to massacre hundreds… pic.twitter.com/r8odyBAVlA
— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1)
undefined
గత వారాంతంలో జరిగిన మారణకాండలో ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడంలో అబూ మురాద్ కీలక పాత్ర పోషించారని, వీరిలో హ్యాంగ్ గ్లైడర్లపై గాల్లోంచి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబాట్లకు నాయకత్వం వహించిన హమాస్ కమాండో దళాలకు చెందిన డజన్ల కొద్దీ స్థావరాలపై రాత్రంతా వేర్వేరు దాడులు చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
కాగా.. హమాస్ గత శనివారం ఇజ్రాయెల్ పై దాడులు చేసి వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. అప్పటి నుంచి ఈ దాడిలో ఇజ్రాయెల్ లో 1,300 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో 1,530 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ లో సుమారు 1,500 మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం వల్ల అనేక మంది పౌరులు కూడా నిరాశ్రయులు అవుతున్నారు.
అక్టోబర్ 7 నుండి ఇప్పటి వరకు 423,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (యుఎన్ఆర్ డబ్ల్యూఏ) పేర్కొంది. వీరిలో 2,70,000 మందికి పైగా యూఎన్ఆర్డబ్ల్యూఏ షెల్టర్లలో ఆశ్రయం పొందారు. గాజాలో 50,000 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని, ఆరోగ్య కార్యకర్తలు, హాస్పిటల్స్, క్లినిక్ లు దాడికి గురికావడంతో వారికి అవసరమైన వైద్య సేవలు అందడం లేదు. కాగా.. వీరిలో 5,500 మంది మహిళలు వచ్చే నెలలో ప్రసవించనున్నారు.