
ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగా ఒక్క సారిగా పిడుగుపడింది. అది నేరుగా ఫుట్ బాల్ క్రీడాకారుడిపై పడటంతో గ్రౌండ్ లోనే అక్కడికక్కడే మరణించాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఫుట్ బాల్ క్రీడాకారుడు మైదానంలో మామూలుగా నడుస్తున్నాడు. బాల్ తన వద్దకు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అయితే సడెన్ గా పై నుంచి నేరుగా అతడిపై పిడుగుపడింది. దీంతో అతడు ఒక్క సారిగా అక్కడే కుప్పకూలిపోయాడు.
అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. లోపల ఎలా ఉందో చూడండి..
దీంతో మైదానంలోని ఇతర ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి. కానీ సహచరులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. కానీ పిడుగుపాటుతో ఆయన మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడిన క్రీడాకారుడు హఠాన్మరణానికి గురికావడంతో సహచరులు తీవ్రంగా విలపించారు.