బెలూన్ లో చిక్కుకుపోయిన రైతు.. తాడు తెగడంతో రెండురోజులు గాలిలోనే...

By Bukka SumabalaFirst Published Sep 9, 2022, 2:12 PM IST
Highlights

ఓ రైతు పైన్ కాయలు కోయడానికి హైడ్రోజన్ బెలూన్ లో చెట్టుమీదికి వెళ్లాడు. ఆ సమయంలో బెలూన్ తాడు తెగిపోయింది. దీంతో గాలికి కొట్టుకుపోయి.. రెండు రోజులపాటు బెలూన్ లోనే ఉండిపోయాడు. 

బీజింగ్ : హైడ్రోజన్ బెలూన్ సహాయంతో చెట్టు మీది నుంచి పైన్ కాయలు కోస్తుండగా.. ఉన్నట్టుండి బెలూన్ తాడు తెగిపోయింది. ఆ సమయంలో బేలూన్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఓ వ్యక్తి వెంటనే కిందికి దూకేశాడు. మరో వ్యక్తి దూకేలోపే... ఏమయ్యిందో తెలీదు కానీ అందులోనే చిక్కుకుపోయాడు. దీంతో రెండు రోజుల పాటు గాలిలో అలా చక్కర్లు కొడుతూ ఉండిపోయాడు. ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత క్షేమంగా కిందికి దిగి వచ్చాడు.  ఈశాన్య చైనాలోని షిలాంగ్ షియాంగ్  ప్రావిన్స్లో  ఈ ఘటన చోటు చేసుకుంది.  

బెలూన్ నుంచి కిందికి దూకిన వ్యక్తి.. తన సహచరుడి గురించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అతను ఇచ్చిన సమాచారంతో.. అందులో చిక్కుకుపోయిన  మరో వ్యక్తి ‘హు’ (40) కోసం అధికారులు  గాలింపు చర్యలు చేపట్టారు. గాలికి కొట్టుకుపోతూ ఆ బెలూన్ అప్పటికే వందల కిలోమీటర్లు దాటింది. అయితే లక్కీగా బెలూన్ లో చిక్కుకుపోయిన వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ ఉంది. అదే అతడిని కాపాడింది. అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ తో మాట్లాడి కిందకి మెల్లగా ఎలా దిగాలో సూచనలు చేస్తూ వచ్చారు. 

వివాహేతర సంబంధం : వదినను కొడవలితో నరికి చంపిన మరిది...

రెండో రోజుకు దాదాపు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లిన ‘హు’ రష్యా సరిహద్దులోమళ్లీ భూమి మీదకు చేరుకున్నాడు. రెండు రోజులు అలా బెలూన్ లో గాలిలోనే ఉన్నా అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని, కాకపోతే రెండు రోజులు గాలిలో నిలబడి ఉండడంతో వెన్నునొప్పి ఉన్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు.  ఆస్పత్రిలో కోలుకుంటున్న ‘హు’ తన వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు. ఈశాన్య చైనాలో వంటల తయారీలో పైన్ కాయలు  విరివిగా వాడతారు. వీటిని గతంలో మంచూరియా అనేవారు. 

click me!