
న్యూఢిల్లీ: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ మరణించారనే వార్త బయటకు రాగానే.. ట్విట్టర్‌లో అనూహ్యమై ట్రెండ్ ఒకటి కనిపంచింది. కోహినూర్ పేరిట ఆ ట్రెండ్ నడిచింది. క్వీన్ ఎలిజబెత్ 2 మరణించగానే.. కోహినూర్ డిమాండ్ తిరిగి భారత్‌కు అప్పగించాలనే డిమాండ్ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆమె మరణం తర్వాతైనా కోహినూర్ డైమండ్‌ను భారత్‌కు అప్పగించి హుందాగా వ్యవహరించాలని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఓ వార్తా కథనం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నది.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని క్వీన్ ఎలిజబెత్ 2 పెట్టుకునేవారు. ఆమె మరణం తర్వాత జరగబోతున్న ప్రధాన మార్పుల్లో కోహినూర్ డైమండ్ కూడా ఉన్నది. తాను మరణించిన తర్వాత కోహినూర్ డైమండ్ ఎక్కడకు చేరాలనే విషయాన్ని స్వయంగా క్వీన్ ఎలిజబెత్ ప్రకటించినట్టు ఆ కథనం పేర్కొంది. క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనం ఆశ్రయించనున్నారు. చార్లెస్ కింగ్ అయిన తర్వాత ఆయన భార్య క్యామిలాకు ఆ కోహినూర్ డైమండ్ పొదిగిన క్రౌన్ చెందుతుందని ఇదే ఏడాది తొలినాళ్లలో క్వీన్ ఎలిజబెత్ తెలిపారు. అంటే.. చార్లెస్ సింహాసనాన్ని ఆశ్రయించగానే.. ఆయన సతీమణి క్యామిలాకు కోహినూర్ క్రౌన్ దక్కనుంది.
14 శతాబ్దంలో ఈ కోహినూర్ డైమండ్ మన దేశంలో లభించింది. ఆ తర్వాత చాలా మంది చేతులు మరి చివరకు బ్రిటన్ రాజవంశానికి చేరింది. 1849లో పంజాబ్‌ను బ్రిటీష్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ డైమండ్‌ను క్వీన్ విక్టోరియాకు అందించినట్టు తెలుస్తున్నది. అప్పటి నుంచి ఈ వజ్రం బ్రిటీష్ రాణి కిరీటంలో ఉన్నది. అయితే, ఈ వజ్రంపై యాజమాన్య హక్కులు ఎవరికి ఉంటాయనే ప్రశ్నను లేవదీసింది. దీనిపై భారత్ సహా నాలుగు దేశాల మధ్య ఈ హక్కు అంశం ఉన్నట్టు సమాచారం.
బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె తన 96వ యేటా తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. 70 ఏళ్లపాటు ఆమె బ్రిటన్‌కు రాణిగా కొనసాగారు.
క్వీన్ ఎలిజబెత్ 2 తన చివరి రోజుల్లో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ రిట్రీట్‌లో గడిపారు. ఆమె అనారోగ్యం దారుణంగా దిగజారడంతో రాజ వంశస్తులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 తనయుడు, ఆమె వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవళ్లు విలియం, హ్యారీలు, ఇతర కుటుంబ సభ్యులు స్కాట్లాండ్ చేరుకున్నారు.