విదేశీ నౌకల కోసం వేసిన ఉచ్చులో చైనా సబ్ మెరైన్ చిక్కుకుంది. దీని వల్ల 55 మంది నావికులు మరణించారు. అయితే ఈ ప్రమాదంపై వస్తున్న వార్తలను చైనా కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవాలని తెలిపింది.
ఎల్లో సముద్రంలో విదేశీ నౌకల కోసం రూపొందించిన ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి (సబ్ మెరైన్) చిక్కుకుంది. దీంతో 55 మంది చైనా నావికులు మరణించారు. ఈ విషయాన్ని ‘ది మిర్రర్’ నివేదించింది. యూకే సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. జలాంతర్గామి "చైన్ అండ్ యాంకర్" ఉచ్చుకు చిక్కుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
undefined
ఇలా ఉచ్చులో చిక్కుకోవడం వల్ల జలాంతర్గామిలోని ఆక్సిజన్ వ్యవస్థల్లో విపరీతమైన లోపం ఏర్పడింది. ఫలితంగా అందులో ఉన్న సిబ్బంది మొత్తం విషప్రయోగానికి గురై మరణించారు. మృతుల్లో చైనా పీఎల్ఏ నేవీ సబ్మెరైన్ '093-417' కెప్టెన్, మరో 21 మంది అధికారులు ఉన్నారు.
"Fifty-five Chinese sailors are feared dead after their nuclear submarine apparently got caught in a trap intended to ensnare British sub-surface vessels in the Yellow Sea...According to a secret UK report the seamen died following a catastrophic failure of the oxygen systems" https://t.co/CiPR7OcmWv
— Shashank Joshi (@shashj)కాగా.. ఈ ఘటనను చైనా అధికారికంగా ఖండించింది. 15 ఏళ్ల కంటే తక్కువ కాలంగా సర్వీసులో ఉన్న జలాంతర్గామి కోసం అంతర్జాతీయ సహాయాన్ని నిరాకరించింది. యూకే నివేదికల ప్రకారం.. ఆగస్టు 21న స్థానిక కాలమానం ప్రకారం 08:12 గంటలకు ఎల్లో సముద్రంలో ఓ మిషన్ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దీని ఫలితంగా 22 మంది అధికారులు, 7 ఆఫీసర్ క్యాడెట్లు, 9 మంది చిన్న అధికారులు, 17 మంది నావికులతో సహా 55 మంది సిబ్బంది మరణించారు. మృతుల్లో కెప్టెన్ కల్నల్ జుయ్ యోంగ్ పెంగ్ కూడా ఉన్నారు.
China's submarine strategy on a map pic.twitter.com/6eff0YTAji
— 🇨🇵France Liberté🇨🇵 (@franceliberte45)సబ్ మెరైన్ లో సిస్టమ్ ఫెయిల్యూర్ కారణంగా హైపోక్సియా బారిన పడి మరణాలు సంభవించాయని భావిస్తున్నారు. అమెరికా, దాని అనుబంధ
జలాంతర్గాములను ట్రాప్ చేయడానికి చైనా నావికాదళం ఉపయోగించిన గొలుసు, లంగరు అడ్డంకిని జలాంతర్గామి ఢీకొట్టింది. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కు దారితీసింది. సబ్ మెరైన్ ను రిపేర్ చేయడానికి, ఉపరితలంపైకి తీసుకురావడానికి ఆరు గంటలు పట్టింది. ఆన్బోర్డ్ ఆక్సిజన్ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని చైనా అధికారికంగా ధృవీవీకరించలేదు. ఈ ఘటనపై వస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని ఆ బీజింగ్ కొట్టిపారేయగా, తైవాన్ కూడా ఇంటర్నెట్ వార్తలను ఖండించింది.