అమెరికాలో దుండగుడి కాల్పులు: 8 మంది మృతి, ఆత్మహత్య చేసుకొన్న నిందితుడు

Published : Apr 16, 2021, 01:05 PM IST
అమెరికాలో దుండగుడి కాల్పులు: 8 మంది మృతి, ఆత్మహత్య చేసుకొన్న నిందితుడు

సారాంశం

అమెరికాలోని గురువారం నాడు రాత్రి ఓ దుండగుడి కాల్పుల్లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగుడు కూడ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

వాషింగ్టన్: అమెరికాలోని గురువారం నాడు రాత్రి ఓ దుండగుడి కాల్పుల్లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాల్పుల తర్వాత దుండగుడు కూడ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం నాడు రాత్రి  ఇండియానాపోలీస్  ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని   ఫెడ్‌ఎక్స్ ఫెసిలిటీ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకొందని  పోలీసులు తెలిపారు. 

ఇండియానా పోలీస్ మెట్రోపాలిటిన్ పోలీస్ శాఖ ఈ విషయాన్ని మీడియాకు వివరించింది. గురువారం నాగు రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఇండియానాపోలీస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకొంది. 

గాయపడినవారిని  సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు.  ఈ ఘటన వివరాలను పోలీస్ శాఖ అధికార ప్రతినిధి జెనే కుక్ మీడియాకు వివరించారు.ఆటోమెటిక్ మెషిన్ గన్ ను చేతిలో పట్టుకొన్న వ్యక్తి బహిరంగంగా కాల్పులు జరుపుతుండడం చూసినట్టుగా ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 

నిందిుతుడు ఎందుకు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఎందుకు ఆత్మహత్య  చేసుకొన్నాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !