పార్లమెంట్ జూమ్ కాల్ లో నగ్నంగా మంత్రి.. ! బాడీ షేప్ బాగుందన్న ప్రతిపక్షనేత... !!

By AN TeluguFirst Published Apr 16, 2021, 12:48 PM IST
Highlights

కెనడాలో ఓ శాసనసభ్యుడు పార్లమెంట్ జూమ్ కాల్ లో పూర్తి నగ్నంగా కనబడడం కలకలం రేపింది. హౌస్ ఆఫ్ కామన్స్ జూమ్ కాన్ఫరెన్స్ కాల్‌లో సదరు శాసనసభ్యుడు పూర్తి నగ్నంగా కనిపించాడు.. వెంటనే తప్పు నుండి తేరుకుని తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు.

కెనడాలో ఓ శాసనసభ్యుడు పార్లమెంట్ జూమ్ కాల్ లో పూర్తి నగ్నంగా కనబడడం కలకలం రేపింది. హౌస్ ఆఫ్ కామన్స్ జూమ్ కాన్ఫరెన్స్ కాల్‌లో సదరు శాసనసభ్యుడు పూర్తి నగ్నంగా కనిపించాడు.. వెంటనే తప్పు నుండి తేరుకుని తన సహచరులకు క్షమాపణలు చెప్పాడు.

లిబరల్ ఎంపి అయిన విలియం అమోస్, వర్చువల్ సెషన్‌లో ల్యాప్‌టాప్ కెమెరా ముందు దిగంబరంగా కనిపించాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకుని క్షమాపణలు తెలిపారు. తన ఆఫీసులో జరిగిన ఈ మిస్టేక్ మీద ‘నేను చాలా పెద్ద తప్పు చేశాను. దీనికి నేను సిగ్గుపడుతున్నాను’ అని 46 ఏళ్ల ఈ శాసనసభ్యుడు ట్వీట్ చేశాడు. 

వర్క్ క్లోత్స్ కు మారుతుండగా నా లాప్ టాప్ కెమెరా ఆన్ అయ్యింది. అది నేను నిజంగా చూసుకోలేదు. దీనికి నా సహోద్యోగులందరినీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. నిజంగా జరిగింది ఇది. మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటాను’ అని ట్వీట్ చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో  వర్చువల్ సెషన్ లో క్వశ్చన్ అవర్ నడుస్తుంది. ఈ సమయంలో ఆ సెషల్ లో సదరు మంత్రి సమాధానాలు చెప్పే అవసరం కూడా లేదు. అయినా అతను వర్కింగ్ డ్రెస్ లోకి మారాలనుకున్నాడంటే అతను హౌస్ ఆఫ్ కామన్స్ గైడ్‌బుక్‌ను ఉల్లంఘించినట్టే.

'రూల్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ డెకోరం' సెక్షన్ ప్రకారం., చర్చలో కూర్చునేందుకు డ్రెస్ కోడ్ అవసరం లేదు. కానీ పురుష స్పీకర్లు షర్ట్, జాకెట్, టై లాంటి సమకాలీన బిజినెస్ దుస్తులను ధరిస్తున్నారు.  

అయితే ఈ క్రమంలో జరిగిన ఈ మిస్టేక్ ఇంటర్నల్ హౌస్ ఆఫ్ కామన్స్ ఫీడ్‌లో మాత్రమే కనిపించింది. పబ్లిక్ ఫీడ్ లో ఇది లేకపోవడం వల్ల పాపం కెనడియన్ ప్రజలు తమ మంత్రి ఎలా బర్త్ డే డ్రెస్ లో దర్శనమిచ్చాడో చూడలేకపోయారు. 

ఈ సంఘటన మీద అమోస్ లిబరల్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా స్పందించలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ విప్ క్లాడ్ డెబెల్లెఫ్యూల్ మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తారు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భాద్యతాయుతమైన సభ్యులు నిరంతరం పూర్తిగా కవర్ చేసుకుని ఉండాలని గుర్తు చేశారు.

టై, జాకెట్ ఎంత ముఖ్యమో.. షర్ట్, బాక్సర్ షార్ట్స్ లేదా పాంటు వేసుకోవడం కూడా అంతే ముఖ్యం అని పురుష సభ్యులు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.. అని ఆమె ఫ్రెంచ్ లో కెనడియన్ మీడియా ముందు మాట్లాడారు. 

ఆయన మంచి శరీరాకృతితో ఉన్నాడు మేం చూశాం. కానీ సభ్యులు కెమెరా ముందుకు వచ్చేముందు, కెమెరా నియంత్రించే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని వారికి మరోసారి తెలపాలి.. అన్నారామె. 

click me!