వృద్ధులు కోవిడ్ టీకాలు వేసుకోకుంటే జరిమానా.. నేటినుంచే అమలు.. ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Jan 17, 2022, 1:20 PM IST
Highlights

వృద్ధులకు కోవిడ్ టీకాలు వేయడానికి ఈ జరిమానాలు విధిస్తున్నామని గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిత్సోటాకిస్ చెప్పారు. ఇప్పటికీ టీకాలు వేయించుకోని వృద్ధులు ముందుకు వచ్చి  టీకాలు వేయించుకోవాలని  Kyriakos mitsotakis కోరారు.
 

గ్రీస్ : ఓ వైపు మనదేశంలో వ్యక్తికి ఇష్టం లేకుండా కరోనా టీకాలు వేయలేమని కేంద్రం తేల్చిచెబితే గ్రీస్ లో మాత్రం టీకాలు వేసుకోకుంటే జరిమానా విధిస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బ్రిటన్ కరోనా ఆంక్షల మీద బ్యాన్ విధించాలని ఆలోచిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆయా దేశాల్లో కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగానే జరుగుతున్నాయి. 

Greeceలో 60 ఏళ్ల వయసు నిండిన వారు covid vaccines వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి Fineలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతో పాటు ఆరోగ్య సంరక్షణ పై ఒత్తిడిని తగ్గించేందుకు గ్రీస్ ప్రభుత్వం తాగాజా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

వృద్ధులకు కోవిడ్ టీకాలు వేయడానికి ఈ జరిమానాలు విధిస్తున్నామని గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిత్సోటాకిస్ చెప్పారు. ఇప్పటికీ టీకాలు వేయించుకోని వృద్ధులు ముందుకు వచ్చి  టీకాలు వేయించుకోవాలని  
Kyriakos mitsotakis కోరారు.

covid vaccines చేయించుకోకపోతే ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.  కోవిడ్ మరణాల్లో  పదిమందిలో  తొమ్మిది మంది 60 ఏళ్ల వయసు కంటే ఎక్కువ వారు ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన పదిమందిలో ఏడుగురు కరోనా వ్యాక్సిన్  తీసుకోనివారు ఉన్నారు.  గ్రీస్ దేశంలో 5 లక్షల 20 వేల మంది వృద్ధులు కరోనా టీకాలు చేయించుకోలేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

టీకాలు వేయించుకోని వృద్ధులకు నెలకు hundred euros జరిమానా విధిస్తామని గ్రీస్ అధికారులు చెప్పారు. యూరప్లోని గ్రీసు దేశంలో Omicron variant కారణంగా ఈ నెలలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి.  కోవిడ్ సంబంధిత మరణాలు మునుపటికంటే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

మరోవైపు, యూరప్ లో covid 19 ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. corona virus కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. Omicron variant కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో  ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడింది. ఈ Vaccine ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ.. పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా First wave సమయంలో 14 రోజుల Quarantine ఉండగా, ఆ తర్వాత దీన్ని వారం రోజులకు తగ్గించారు.

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం వస్తోంది.

కరోనా ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ప్రధాని  Boris Johnsonఉన్నారని, లీగల్ గా చర్యలు తీసుకోవడం వలన కరోనాకేసులు తగ్గుతాయని అనుకోవడం లేదని, ప్రత్యామ్నాయంగా కోవిడ్ ను కట్టడి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలపై ఇప్పటికే Britain లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. 

click me!