కోవిడ్ ఎమర్జెన్సీ చట్టాలు బ్యాన్? ఆ దేశ ప్రధాని మరో కీలక నిర్ణయం ! ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Jan 17, 2022, 12:10 PM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం వస్తోంది.

యూరప్ లో covid 19 ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. corona virus కారణంగా బ్రిటన్ అతలాకుతలం అయింది. Omicron variant కేసులు ఈ దేశంలోనే విధ్వంసం సృష్టించాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ దేశంలో  ఒమిక్రాన్ వేరియంట్ విరుచుకుపడింది. ఈ Vaccine ను అందిస్తుండటంతో కరోనా బారిన పడినప్పటికీ.. పెద్దగా మరణాలు సంభవించలేదు. దీంతో కరోనా First wave సమయంలో 14 రోజుల Quarantine ఉండగా, ఆ తర్వాత దీన్ని వారం రోజులకు తగ్గించారు.

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో క్వారంటైన సమయాన్ని వారం రోజుల నుంచి 5 రోజులు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనే సమాచారం వస్తోంది.

కరోనా ఎమర్జెన్సీ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ప్రధాని  Boris Johnsonఉన్నారని, లీగల్ గా చర్యలు తీసుకోవడం వలన కరోనాకేసులు తగ్గుతాయని అనుకోవడం లేదని, ప్రత్యామ్నాయంగా కోవిడ్ ను కట్టడి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా ఆంక్షలపై ఇప్పటికే Britain లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. 

ఇదిలా ఉండగా, మనదేశంలో ఒకరికి ఇష్టం లేకుండా Corona vaccination ఇవ్వాలని ఏ covid clauseలోనూ లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన covid-19 Vaccine Guidelines ప్రకారం వ్యక్తి సమ్మతి లేకుండా.. Forcedగా టీకాలు వేయకూడదని ఉందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Disability personsకు టీకా ధృవీకరణ పత్రాల్లో మినహాయించే అంశంపై జరిగే విచారణలో ఈ విషయాన్ని పేర్కొంది. అంతేకాదు ఏ ఉద్దేశానికైనా Vaccine certification documentని తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేసే SOP ఏదీ జారీ చేయలేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

NGO Evara Foundation కు కౌంటర్ గా వేసిన అఫిడవిట్ లో కేంద్రం ఈ విషయాన్ని జోడించింది. ఎన్‌జిఓ ఎవారా ఫౌండేషన్ వికలాంగులకు డోర్ టు డోర్ తిరిగి కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ఇస్తామని.. అందుకు అంగీకరించాలని చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విషయాన్ని తెలిపింది.

"భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాలు.. మార్గదర్శకాలు సంబంధిత వ్యక్తి సమ్మతి పొందకుండా బలవంతంగా టీకాలు వేయకూడదని ఇది సమర్పించబడింది. అంతేకాదు ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ఇంత స్థాయిలో జరుగుతుందని తెలిపింది. మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు వస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.

అంతేకాదు ‘పౌరులందరూ టీకాలు వేసుకోవాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా లాంటి వార్తా మాధ్యమాల్లో సలహాలు, ప్రచారం, కమ్యూనికేట్ చేస్తున్నామని, ప్రకటనలు ఇస్తున్నామని దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ సులభతరం అవుతోందని... మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా టీకాలు వేసుకోమని ఏ వ్యక్తిని బలవంతం చేయలేం.. అని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. 

click me!