
Dawood Ibrahim aide dies: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, మాఫీయా డాన్ చోటా షకీల్ సన్నిహితుడు సలీం గాజీ మరణించారు. ఆయన పాకిస్థాన్‌లోని కరాచీలో శనివారం చనిపోయినట్లు ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి. గుండె సంబంధిత సమస్యలతో గాజీ మరణించినట్లు వెల్లడించాయి. అతను మధుమేహం, రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి.
మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో 1993లో జరిగిన వరుస పేలుళ్ల యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఈ పేరు విన్న ఇప్పటికీ కొంతమందికి చెమటలు పడుతాయి. వారికొందరూ ఉలిక్కిపడుతారు. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. ఈ ఘటన 1993 మార్చి 12న జరిగింది. ఈ పేలుళ్లలో 713 మంది గాయపడగా, 257 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస పేలుళ్ల ఘటనలో కీలక ప్రాతధారి.
మోస్ట్ వాంటెడ్ నిందితుడు, దావూద్ గ్యాంగ్ సభ్యుడు, ఛోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడు సలీం ఘాజీ (Salim Ghazi) అని పోలీసులు గుర్తించారు.
ఈ పేలుళ్ల అనంతరం దావూద్ గ్యాంగ్‌తో కలిసి సలీం గాజీ.. పాకిస్థాన్‌కు పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని పట్టుకోవడంలో భారత అధికారులు విఫలమయ్యారు. ఈ ఘటన అనంతరం తన ఆచూకీ లభించకుండా.. నిరంతరం తన ఉనికి మార్చుకుంటూ వచ్చాడు. దుబాయ్‌లో, ఆపై పాకిస్థాన్‌లో ఛోటా షకీల్ అక్రమ కార్యకలాపాలకు సైతం ఘాజీ సహకరించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ పేలుడు కుట్రదారుల్లో ఒకడైన టైగర్ మెమన్ సోదరుడు యూసఫ్ మెమన్ నాసిక్ రోడ్ సెంట్రల్ జైలులో గతేడాది మరణించాడు. మరో దోషి ముస్తఫా దోస్సా 2017లో మృతి చెందాడు.
ఈ ఉగ్రవాదులంతా కరాచీ లేదా యూఏఈలో ఇప్పటికీ తలదాచుకుంటున్నారని ఇంటిలిజెన్స్ పేర్కొంటోంది. సలీం ఘాజీపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. అతనిని పట్టుకోవడానికి ఇంటర్‌పోల్ సైతం ప్రయత్నాలు చేస్తోంది. కానీ చాలాసార్లు అతను తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.