దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. ముఖంపై 1000కి పైగా కుట్లు..

Published : Mar 01, 2023, 10:52 AM ISTUpdated : Mar 01, 2023, 11:04 AM IST
దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. ముఖంపై 1000కి పైగా కుట్లు..

సారాంశం

అమెరికాలో ఓ ఆరేళ్ల చిన్నారిమీద పెంపుడు కుక్క దాడి చేయడంతో ఆ చిన్నారి ముఖం మీద వెయ్యికి పైగా కుట్లు పడ్డాయి. 

అమెరికా : చిన్నారుల మీద కుక్కలు దాడి చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  అయితే చిన్నారుల మీద కుక్కలు దాడి చేయడం ఒక మన రాష్ట్రానికి, మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఇలాంటి ఓ దారుణమైన ఘటనలో ఓ ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాల పాలయ్యింది. పక్కింట్లో ఉన్న ఫ్రెండ్ తో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చిన్నారిపై కుక్క దాడి చేసింది.

శూనకం దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలికను బతికించడం కోసం వైద్యులు దాదాపు 12 గంటల పాటు శస్త్ర చికిత్సలు చేశారు.  1000కి పైగా కుట్లు వేశారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ దారుణమైన ఘటన అమెరికాలోనే చెస్టర్ విల్లేలో జరిగింది. ఫిబ్రవరి 18న ఈ ప్రాంతానికి చెందిన లిల్లీ నార్టన్ అనే ఆరేళ్ల బాలిక తన పక్కింట్లోని స్నేహితురాలితో ఆడుకోవడానికి వెళ్ళింది. అక్కడ వారిద్దరూ కలిసి టేబుల్ దగ్గర కూర్చొని కార్డ్స్ ఆడుకుంటున్నారు.

గ్రీస్‌లో రెండు రైళ్లు ఢీ.. 26 మంది మృతి, 85 మందికి గాయాలు

ఇంతలో వారింట్లో పెంచుకుంటున్న పిట్ బుల్ జాతికి చెందిన కుక్క ఒక్కసారిగా చిన్నారి మీద దాడికి దిగింది. ఈ దాడిలో చిన్నారి ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. పంటిగాట్లు పడడంతో బాలిక ముఖమంతా చిత్రమయింది. అనుకోని ఈ ఘటనకు లిల్లీతో పాటు అక్కడే ఉన్న ఆమె స్నేహితురాలు భయంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో లోపలి గదిలో ఉన్న ఆ స్నేహితురాలి తల్లి  పరుగు పరుగున వచ్చి కుక్కను అక్కడి నుంచి వెలగొట్టింది. 

లిల్లీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వచ్చిన తర్వాత హుటాహుటిన లిల్లీని బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ కి తరలించారు. అయితే చిన్నారి చికిత్సకు చాలా డబ్బు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో.. తల్లిదండ్రులు డైలమాలో పడ్డారు. తమ దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో స్నేహితులను సహాయం కోరారు. దీంతో లిల్లీ కుటుంబ స్నేహితుడైన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో నిధులు సేకరించారు. 

 ఆపరేషన్ కి అవసరమైనంత నిధులు సమకూరిన తర్వాత ఈ శనివారం లిల్లీకి ఆపరేషన్ చేశారు. ముఖం మీద ఎలా పడితే ఎలా తీవ్రంగా గాయం చేయడంతో వెయ్యికి పైగా కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు వారం తర్వాత చిన్నారి లిల్లీకి మరో ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని కాకపోతే ఇప్పట్లో బాలిక మాట్లాడడం, నవ్వడం చేయలేదని తెలిపారు. కుక్క దాడిలో ముఖ కండరాలు తీవ్రంగా గాయపడడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. తమ కూతురిని బతికించుకోవడానికి చాలా కష్టపడ్డామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ హుషారుగా ఆడుతూ పాడుతూ తిరిగే తన కూతురికి కుక్కలు అంటే కూడా ఎంతో ప్రేమ అని గుర్తు చేశారు. లిల్లీ తల్లి డోరతీ నార్టిన్ మాట్లాడుతూ… తన కూతురు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని  విలపించారు. 

PREV
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..