6 నెలల చిన్నారిపై ఎలుకలు దాడి చేశాయి. ఆ పసికందు ఎముకలు కనిపించేలా మాంసం పీక్కుతిన్నాయి. అయితే ఆ బాలికను హాస్పిటల్ కు తరలించే లోపే పరిస్థితి విషమించి మరణించింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, అత్తను పోలీసులు అరెస్టు చేశారు.
అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 6 నెలల పసికందుపై ఎలుకలు దాడి చేశాయి. ఆ పసి కందును 50 సార్లకు పైగా కరిచి, ఆహారంగా తిన్నాయి. దీంతో ఆ బాలిక తీవ్ర గాయాలతో మరణించింది. ‘యూఎస్ఏ టుడే’ కథనం ప్రకారం సెప్టెంబర్ 13న ఇండియానాలో ఈ ఘటన జరిగింది. అయితే ఆ బాలికను సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న తల్లిదండ్రులను, అలాగే అత్తను పోలీసులు అరెస్టు చేశారు.
డేవిడ్, ఏంజెల్ షోనాబామ్ దంపతులకు గతంలో ముగ్గురు పిల్లలు ఉండగా.. 6 నెలల కిందట ఓ బాలిక జన్మించింది. మొత్తంగా నలుగురు పిల్లలు, ఇద్దరు దంపతులు, డేవిడ్ సోదరి ఆ ఇంట్లో నివసిస్తున్నాయి. అయితే ఇంత మంది ఒకే చోటు నివసిస్తున్నప్పటికీ ఆ పసికందు సంరక్షణలో వారంతా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల ఆ బాలిక నిద్రపోతున్న సమయంలో ఎలుకల గుంపు దాడి చేసింది. ఆ చిన్నారి బతికుండగానే మాసం కొరుక్కొని తిన్నాయి.
దీంతో పసికందు ఎముకలు కూడా బయటకు కనిపించాయి. చేతి వేళ్ల మాంసం కూడా ఎలుకలు తినేశాయి. తరువాత దీనిని గమనించిన తల్లిదండ్రులు షాక్ కు గురై చిన్నారిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ బాలిక అప్పటికే మరణించిదని డాక్టర్లు తెలిపారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకొన్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులు చూసి విస్మయానికి గురయ్యారు. ఆ ఇళ్లు మొత్తం చెత్తా చెదారంతో నిండి ఉంది. ఎలుకల మలం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ చెత్తా చెదారం కింద ఎలుకలు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు.
కాగా.. ఆ ఇంట్లో ఉన్న పిల్లలను ఎలుకలు కొరకడం ఇదే మొదటి సారి కాదు. సెప్టెంబర్ ప్రారంభంలో ఇంట్లో ఉన్న ఇతర పిల్లలపై కూడా సెప్టెంబర్ మొదటి వారంలో దాడి చేశాయి. వీటిని పరిశీలనలోకి తీసుకున్న ఇండియానా పోలీసు అధికారులు బాలుడి తల్లిదండ్రులను, అత్తను అరెస్టు చేశారు.