నేపాల్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత..

నేపాల్‌లో మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం ఉదయం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

Google News Follow Us

నేపాల్‌లో మరోసారి భూకంపం వణికించింది. ఆదివారం ఉదయం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఇక, భూకంపం 13 కి. మీ (8.1 మైళ్లు) లోతులో సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం ప్రభావంతో బాగ్మతి, గండకి ప్రావిన్సులలోని ఇతర జిల్లాలలో కూడా కుదుపు కనిపించింది.

మరోవైపు ఢిల్లీ-ఎన్‌సీఆర్ వరకు కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఇక, నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా మారాయి.  నేపాల్ ప్రభుత్వం పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్ (పీడీఎన్‌ఏ) నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో 11వ స్థానంలో ఉంది.