బందీలను విడుదల చేసేందుకు హమాస్‌ కండీషన్.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితే గంటలోపు రిలీజ్..!!

Published : Oct 18, 2023, 11:56 AM IST
బందీలను విడుదల చేసేందుకు హమాస్‌ కండీషన్.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితే గంటలోపు రిలీజ్..!!

సారాంశం

ఇజ్రాయెల్- హమాస్ యుద్దం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. అయితే తాజాగా బందీలందరినీ ఒక షరతుపై విడుదల చేయడానికి హమాస్ గ్రూప్ ముందుకొచ్చింది. 

 

ఇజ్రాయెల్- హమాస్ యుద్దం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. ఈ నెల 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మికంగా రాకెట్ల దాడికి దిగడం.. ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించడంతో యుద్దం మొదలైంది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. మరోవైపు హమాస్ కూడా క్షిపణులతో విరుచుకుపడుతుంది. అయితే హమాస్ చేతుల్లో పలువురు బందీలుగా ఉండటం వారి కుటుంబ సభ్యులనే కాకుండా ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. బందీలందరినీ బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని హమాస్‌ను ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కోరారు. అయితే తాజాగా బందీలందరినీ ఒక షరతుపై విడుదల చేయడానికి హమాస్ గ్రూప్ ముందుకొచ్చింది. 

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను నిలిపివేస్తే, అన్ని పౌర బందీలను వెంటనే విడుదల చేయడానికి తమ గ్రూప్ సిద్ధంగా ఉందని హమాస్ సీనియర్ అధికారి ఎన్‌బిసి న్యూస్‌కు తెలిపారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలు తమ సైనిక దాడులను నిలిపివేస్తే.. ఒక గంటలోపు బందీలందరినీ విడిపించేందుకు హమాస్ అధికారి సిద్ధంగా ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది.

 గాజా స్ట్రిప్‌లోని అల్ అహ్లీ ఆసుపత్రిపై మంగళవారం రాత్రి వైమానిక దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన కొద్దిసేపటికే హమాస్ గ్రూప్ నుంచి ఈ విధమైన ప్రకటన వచ్చింది. అయితే గాజాలోని ఆసుపత్రిపై దాడికి బాధ్యత వహించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైందని మిలిటరీ ఇంటెలిజెన్స్ సూచించిందని తెలిపింది. ‘‘ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్సెస్(ఐడీఎఫ్) కార్యాచరణ వ్యవస్థల విశ్లేషణను అనుసరించి, ఇజ్రాయెల్ వైపు రాకెట్ల బారేజీని ప్రయోగించారు. అది గురితప్పి ఆసుపత్రి పరిసరాల్లోకి వెళ్లింది’’ అని ఐడీఎఫ్ ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది. 

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. గాజాలోని "అనాగరిక ఉగ్రవాదులు" ఆసుపత్రిపై దాడి చేశారని అన్నారు. ఇది ఇజ్రాయెల్ సైన్యం పని కాదని స్పష్టం చేశారు. ఇక, గాజాలోని ఆస్పత్రిపై జరిగిన వైమానిక దాడి వల్ల 500 మందికి పైగా మరణించారని నివేదికలు సూచిస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !