
సెంట్రల్ అమెరికాలో భారీ భూపంకం (earthquake) చోటుచేసుకుంది. గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాల సిటీలో (Guatemala City) బుధవారం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి (National Center for Seismology) వివరాలను వెల్లడించింది. గ్వాటెమాల సిటీకి 78 కి.మీ దూరంలో, 110 కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలిపింది. అయితే.. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై తదుపరి సమాచారం నివేదించబడలేదు.
మరోవైపు ఈరోజు జమ్ముకశ్మీర్‌లో భూమి స్వల్పంగా కంపించింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉదయం 5.43 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. పహల్గామ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.