ఇరాన్ లో భూకంపం.. ముగ్గురు మృతి, యూఏఈలోనూ ప్రకంపనలు..

By SumaBala BukkaFirst Published Jul 2, 2022, 8:25 AM IST
Highlights

దక్షిణ ఇరాన్‌ ను భూకంపం కుదిపేసింది. శనివారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ముగ్గురు మరణించారు. ఈ భూకంపం వల్ల యూఏఈలో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. 

ఇరాన్ : శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద ఇది  6.1 తీవ్రతను చూపించింది.  ఈ భూకంపం వల్ల కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. 

"ఈ దురదృష్టకరమైన ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు" అని ఇరాన్ గల్ఫ్ తీరంలోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో అత్యవసర నిర్వహణ అధిపతి మెహర్దాద్ హసన్జాదే టెలివిజన్‌తో అన్నారు. ఇరాన్ మీడియా కథనాల ప్రకారం భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) దాని తీవ్రత 6.0గా ఉందని తెలిపింది. భూకంపం భూమికి 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది.

ఇటీవలి కాలంలో ఇరాన్ లో భూకంపాలు తరచుగా వస్తున్నాయి. ఇరాన్ లో సంభవించిన ఈ భూకంపం వల్ల యుఎఇలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ప్రకంపనలు అనుభవించారు. నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) ప్రకారం, దక్షిణ ఇరాన్‌లో తెల్లవారుజామున 1.32 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైంది.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపంలో 155 మంది చిన్నారులు మృతి: ఐరాస

కాగా, ప్రపంచంలోని కనీసం నాలుగు దేశాల్లో శనివారం భూకంపం సంభవించింది. సమాచారం ప్రకారం, ఇరాన్, ఖతార్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో బలమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఇరాన్ దక్షిణ భాగంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఇరాన్ స్థానిక టీవీ ఛానెల్ ప్రకారం, దేశంలోని దక్షిణ భాగంలో భూకంపం కారణంగా కనీసం ముగ్గురు మరణించారు. 8 మంది వ్యక్తులు గాయపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని దుబాయ్ నగరంలో కూడా భూకంపం సంభవించింది.

ఇరాన్, యుఎఇ, ఖతార్‌లలో ఉదయం రెండు పెద్ద భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఇరాన్‌లో కూడా చాలా మంది చనిపోయారు. అదే సమయంలో, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాత్రి 3:30 గంటలకు ఇక్కడ భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. దీని లోతు 10 కిలోమీటర్ల వరకు ఉంది.

click me!