Earthquake: భూకంపంతో వణికిపోయిన పాకిస్థాన్.. మూడు నెలల్లో 5 భూకంపాలు !

By Mahesh RajamoniFirst Published Jan 15, 2022, 2:57 PM IST
Highlights

Earthquake: పాకిస్థాన్‌ భూకంపంతో వ‌ణికిపోయింది. పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్ స‌హా ఉత్తర ప్రాంతంలో శుక్రవారం రాత్రి  భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 5.6 గా న‌మోదైంది. అయితే, ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌న‌ష్ట‌మూ జ‌ర‌గ‌లేదు. 
 

Earthquake: పాకిస్థాన్‌ భూకంపంతో వ‌ణికిపోయింది. పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్ స‌హా ఉత్తర ప్రాంతంలో శుక్రవారం రాత్రి  భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప (Earthquake) తీవ్ర‌త 5.6 గా న‌మోదైంది. అయితే, ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌న‌ష్ట‌మూ జ‌ర‌గ‌లేదు. భూకంపం సంభ‌వించిన వివ‌రాల‌ను పాకిస్థాన్ వాతావ‌ర‌ణ విభాగం (Pakistan Meteorological Department) వెల్ల‌డించింది.  భూకంపం కార‌ణంగా పాకిస్థాన్ రాజ‌ధాని ఇస్లామాబాద్ స‌హా ఉత్త‌ర ప్రాంతంలోని అనేక ఏరియాలు ప్ర‌భావితం అయ్యాయ‌. భూకంపం సంభ‌వించిన సమ‌యంలో ఇండ్ల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదై ఉందని పాకిస్థాన్ వాతావ‌ర‌ణ విభాగం (Pakistan Meteorological Department) తెలిపింది. భూకంపం కార‌ణంగా పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జర‌గ‌లేదు. 

అలాగే, ఉత్తరాదిలోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక్క‌డ భూకంప  తీవ్ర‌త  రిక్ట‌ర్ స్కేల్ పై 5.0 గా న‌మోదు అయింద‌ని పాకిస్థాన్ వాతావ‌ర‌ణ విభాగం (Pakistan Meteorological Department) వెల్ల‌డించింది. నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (NSMC) ప్రకారం, మోస్తరుగా సంభ‌వించిన ఈ  భూకంపం కేంద్రం గ్వాదర్‌కు దక్షిణంగా 50 కిలోమీటర్ల దూరంలో మక్రాన్ సబ్‌డక్షన్ జోన్‌లో 25 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉన్న‌ద‌ని తెలిపింది. "మాక్రాన్ సబ్‌డక్షన్ జోన్‌లో ఇంతటి తీవ్రతతో భూకంపం సంభవించడం దశాబ్దాలలో ఇదే మొదటిసారి.. గ్వాదర్ నుండి ఒమారా వరకు సంభవించింది" అని NSMC డైరెక్టర్ అమీర్ హైదర్ డాన్‌తో చెప్పారు. ఇంత తీవ్రతతో కూడిన భూకంపం పెద్ద‌గా న‌ష్టాన్ని క‌లిగించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ ప్రాంతం ఎప్పుడైనా  భూకంపం తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించే అవకాశం ఉన్నందున ముంద‌స్తు సంసిద్ధత అవసరం అని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న కూడా పాకిస్థాన్ లో భూకంపం సంభ‌విఇంచిది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3 గా న‌మోదైంది. ఈ భూకంపం కార‌ణంగా పాకిస్థాన్ లోని  ఉత్తర భాగంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు ఏర్ప‌డ్డాయి. ఈ ప్రకంపనలు ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో కూడా కనిపించాయి. పాకిస్థాన్ వాతావ‌ర‌ణ విభాగం (Pakistan Meteorological Department) వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. స్వాత్, పెషావర్, లోయర్ దిర్, స్వాబి, నౌషేరా, చిత్రాల్, మర్దాన్, బజౌర్, మలాకంద్, పబ్బి, అకోరా, ఇస్లామాబాద్‌లలో భూకంపం సంభవించింది.  కాగా, పాకిస్థాన్ చురుకైన భూకంప ప్రాంతంలో ఉంది. వివిధ తీవ్రతలతో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. గ‌త అక్టోబర్‌లో సంభవించిన 5.9 తీవ్రతతో కూడిన భూకంపం కార‌ణంగా  బలూచిస్థాన్ లో  కనీసం 15 మందిని ప్రాణాలు కోల్పోయారు. ఇక 2005లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం కార‌ణంగా  74,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత మూడు నెలలుగా భూ ప్రకంపనలు పెరుగుతుండటంపై స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

click me!