టేకాఫ్ సమయంలో ఎదురెదురుగా రెండు ఫ్లైట్స్: హైద్రాబాద్, బెంగుళూరు విమానాలకు తప్పిన ప్రమాదం

By narsimha lodeFirst Published Jan 14, 2022, 9:06 PM IST
Highlights

దుబాయ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే ఈ సమయంలో ఏటీసీ ఒక విమానానికి టేకాఫ్ కు అనుమతిని నిరాకరించడతో ప్రమాదం తప్పింది.

దుబాయ్: Dubai Airport లో  రెండు విమానాలు take off సమయంలో చివరి క్షణంలో ఢీకొనే ప్రమాదం నుండి తప్పించుకొన్నాయి. 
దీంతో  వందలాది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఈ నెల 9వ తేదీన చోటు చేసుకొంది. ఎమిరేట్స్ లోని EK-524  విమానం Dubai -Hyderabad, EK-568 నెంబర్ గల విమానం dubai-Banglore కి వెళ్లాలి.ఈ రెండు విమానాలు దుబాయ్ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో రెండు ఎదురెదురుగా ఒకే రన్ వేపైకి వచ్చాయి. టేకాఫ్ కావాల్సిన సమయంలో గుర్తించిన విమాన సిబ్బంది ఏటీసికి సమాచారం ఇవ్వడంతో ఒక విమానాన్ని టాక్సీ బేకి తరలించారు.ఒక దాని తర్వాత మరో విమానం టేకాఫ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనకు సంబంధించి విమానాశ్రయ సిబ్బంది కథనం ప్రకారంగా వివరాలు ఇలా ఉన్నాయి.రెండు విమానాలు గమ్యస్థానాలకు బయలుదేరడానికి షెడ్యూల్ చేయబడ్డాయి. రెండు విమానాలు ఒకే రన్ వేపైకి రావడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. ఎమిరేట్స్ విమాన షెడ్యూల్ ప్రకారంగా రెండు విమానాలు బయలుదేరడానికి మధ్య ఐదు నిమిషాల తేడా మాత్రమే ఉంది.

దుబాయ్- హైద్రాబాద్ కు వెళ్లే  EK-524  ఫ్లైట్ 30 R రన్ వే నుండి టేకాఫ్ కోసం సిద్దమౌతున్న తరుణంలో అదే దిశలో అధిక వేగంతో వస్తున్న విమానాన్ని సిబ్బంది చూశారు. ఎదురుగా మరో విమానం వస్తున్న విషయాన్ని చెబుతూ టేకాఫ్ ను తిరస్కరించాల్సిందిగా Atcని  విమాన సిబ్బంది కోరారు. విమానం వేగం తగ్గించి రన్ వే దాటిన తర్వాత టాక్సీవే N4 ద్వారా రన్ వే క్లియర్ చేశారు ఎయిర్ పోర్టు సిబ్బంది.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ... దుబాయ్ నుండి బెంగుళూరుకు  EK-568  అదే రన్ వే 30 R నుండి టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే ఏటీసీ జోక్యం తర్వాత బెంగుళూరుకు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం టేకాఫ్ అయింది.హైద్రాబాద్ కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానం ట్యాక్సీ బేకు  వెళ్లింది. కొద్ది నిమిషాల తర్వాత  ట్యాక్సీ బే నుండి ఈ ఫ్లైట్ తిరిగి హైద్రాబాద్ కు బయలు దేరింది.

ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బాడీ ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ (AAIS) ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తీవ్రమైన భద్రత లోపాన్ని నివేదించింది. ఈ విషయమై విమానాయాన సంస్థ అంతర్గత విచారణను ప్రారంభించింది. భద్రత ఎల్లప్పుడూ తమ ప్రధాన ప్రాధాన్యత అని Emirates విమానాయాన సంస్థ తెలిపింది.ఏదైనా సంఘటన జరిగిన సమయంలో తమ స్వంత అంతర్గత సమీక్షను నిర్వహిస్తామని ఏమిరేట్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై ఏఏఐఎస్ విచారణ నిర్వహిస్తుందని ఎమిరేట్స్ ప్రకటించింది.

 హైద్రాబాద్ కు వెళ్లే EK-524 ఫ్లైట్ ఏటీసీ క్లియరెన్స్ లేకుండా టేకాఫ్ కోసం తిరుగుతుంది.  అయితే ఏటీసీ అనుమతి ఇవ్వడంతో బెంగుళూరు వెళ్లాల్సిన ఎమిరేట్ విమానం EK-568కి  అదే రన్ వేకి చేరుకొంది. దీంతో ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బంది టేకాఫ్ ను తిరస్కరించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.
 

click me!