అక్రమ సంబంధం.. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మహిళ.. ఎలాంటి శిక్ష వేశారంటే..!

Published : Jan 15, 2022, 09:32 AM IST
అక్రమ సంబంధం.. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మహిళ.. ఎలాంటి శిక్ష వేశారంటే..!

సారాంశం

అనూహ్యంగా వారు.. రెడ్ హ్యాండెడ్ గా.. అందరికీ దొరికిపోయారు. దీంతో.. వారిద్దరికీ ఘోరమైన శిక్ష విధించడం గమనార్హం. 

భర్తని కాదని ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరికీ తెలియకుండా.. రహస్యంగా వారు.. రాసలీలలు మొదలుపెట్టారు. అయితే.. అనూహ్యంగా వారు.. రెడ్ హ్యాండెడ్ గా.. అందరికీ దొరికిపోయారు. దీంతో.. వారిద్దరికీ ఘోరమైన శిక్ష విధించడం గమనార్హం.  ఈ సంఘటన ఇండోనేషియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండోనేషియాలోని ఎచెహ్‌ ప్రావిన్స్‌లో ఒక మహిళ వివాహేతర సంబంధం గుట్టు రట్టు అయ్యింది. పామాయిల్‌ చెట్లలో ఏకాంతంగా ఆ జంటను స్థానికులు దొరకబట్టారు. అయితే ఆ ప్రియుడు వివాహేతర సంబంధం ఆరోపణల్ని తోసిపుచ్చాడు. ఆమె మాత్రం అది నిజమని ఒప్పుకుంది. దీంతో ఆమెకు 100  కొరడా దెబ్బలు.. ప్లేట్‌ ఫిరాయించిన ప్రియుడికి 15 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. 

ఆమెకు వివాహం కాలేదు. ఇలా లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించడంతో ఆమెకు ఇంత కఠినమైన శిక్ష విధించినట్లు జడ్జి ఇవాన్‌ నజ్జర్‌ అలవి చెప్పారు. జూదం, వ్యభిచారం, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలపై కొరడా ఝులిపించేందుకు పర్షియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోన్న ఏకైక ప్రాంతం ఇండోనేషియాలోని ఎచెహ్‌. పైగా అక్కడ శిక్షలను బహిరంగంగా అమలు చేస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !