
నైరోబీ: పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే జంక్షన్‌లో శుక్రవారం ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు, పాదచారులపైకి దూసుకెళ్లడంతో కనీసం 48 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
టీవీల్లో ప్రసారం అవుతున్న దృశ్యాల్లో క్రాష్ జరిగిన ప్రదేశంలో విధ్వంసం కనిపిస్తుంది. అనేక మినీబస్సుల శిధిలాలు, బోల్తా పడిన ట్రక్కు కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
కెరిచో, నకురు పట్టణాల మధ్య హైవేపై ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసు కమాండర్ జియోఫ్రీ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు 48 మంది మరణించినట్లు నిర్ధారించగలిగాం. ఒకిద్దరు ట్రక్కు కింద చిక్కుకున్నారని అనుమానంగా ఉంది’ అన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని వివిధ ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
10 వేల మంది అమ్మాయిలతో సెక్స్ చేశా! రేప్ కేసు విచారణలో ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..
రిఫ్ట్ వ్యాలీకి చెందిన ప్రాంతీయ పోలీసు కమాండర్ మాట్లాడుతూ, కెరిఖో వైపు ప్రయాణిస్తున్న ట్రక్కు "నియంత్రణ కోల్పోయి ఎనిమిది వాహనాలు, అనేక మోటార్‌సైకిళ్లు, రోడ్డు పక్కన ఉన్న వ్యక్తులు, విక్రేతలు, ఇతర వ్యాపారాలలో ఉన్న ఇతర వ్యక్తులపైకి దూసుకెళ్లింది" దీంతో ఈ ప్రమాదం జరిగింది అన్నారు.
లోండియాని జంక్షన్ అని పిలువబడే రద్దీగా ఉండే ప్రాంతంలో సాయంత్రం 6:30 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తర్వాత అధ్యక్షుడు విలియం రూటోతో సహా కెన్యా నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ ట్విట్టర్‌లో తెలిపారు.
కెరిచో కౌంటీ హాస్పిటల్‌లోని సీనియర్ వైద్యుడు కాలిన్స్ కిప్‌కోచ్ మాట్లాడుతూ, మోర్గ్‌లో ఇప్పటివరకు 45 మృతదేహాలు లభించాయని, మరికొంత మంది బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారని, రెస్క్యూ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.
ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు, రెస్క్యూ కార్యకర్తలను పంపిన కెన్యా రెడ్‌క్రాస్, భారీ వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. "ట్రక్ అధిక వేగంతో వస్తోంది. అది నేరుగా మార్కెట్‌లోకి రాకముందే అనేక వాహనాలను తప్పించేందుకు ప్రయత్నించింది" అని ఒక ప్రత్యేక్ష సాక్షి చెప్పారు.