Latest Videos

మూవీ స్టైల్ ఛేజింగ్.. కారుపైకి ఎక్కి బోల్తా కొట్టిన మ‌రో కారు.. షాకింగ్ యాక్సిడెంట్ వీడియో వైర‌ల్..

By Mahesh RajamoniFirst Published Jun 30, 2023, 2:46 PM IST
Highlights

Melbourne: ఈ వారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు మరో కారు పైకప్పుపైకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బోల్తా పడింది. ఆ త‌ర్వాత కారు డ్రైవర్ బయటకు వచ్చి మరో కారు డ్రైవర్ పై కత్తితో వెంబ‌డించి దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
 

Shocking accident: ఓ రోడ్డు ప్రమాదంలో ఓ కారు మరో కారు పైకప్పుపైకి దూసుకెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బోల్తా పడింది. ఆ త‌ర్వాత కారు డ్రైవర్ బయటకు వచ్చి మరో కారు డ్రైవర్ పై కత్తితో వెంబ‌డించి దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం మెల్‌బోర్న్‌కు తూర్పున 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టినాంగ్ నార్త్‌లోని విక్టోరియా ప్రిన్సెస్ హైవేపై ఈ సంఘటన జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. అయితే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో రద్దీగా ఉండే హైవేపై ఓ కారు మరో కారు పైకప్పును ఢీకొట్టిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. డ్రైవర్ కారు నుంచి దిగి అవతలి వ్యక్తిని కత్తితో వెంబడించడం కూడా ఇందులో కనిపిస్తుంది. news.com.au ప్రకారం, మెల్‌బోర్న్  కు తూర్పున 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న విక్టోరియాలో జూన్ 27 సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో హోల్డెన్ ఆస్ట్రా డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. మరో కారును వెంబడిస్తున్న వాహనం వెళ్తుండగా పక్కకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ముందుకు వెళ్తున్న వాహ‌నం పైక‌ప్పు పైకి ఎక్కి ఢీ కొట్టిన త‌ర్వాత బోల్తా ప‌డింది. 

Terrifying moment two smash into each other during wild road rage clash over tailgating on Princes Highway in Tynong North, 70kms east of - before the dispute gets even worse seconds later pic.twitter.com/2q0HHX6FNJ

— Hans Solo (@thandojo)

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కారు బోల్తా ప‌డిన త‌ర్వాత డ్రైవర్ తన వాహనం నుండి బయటకు వచ్చి.. మరొక డ్రైవర్ ను కత్తితో బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరికొందరు పోలీసులకు స‌మాచారం అందించారు. వీడియోలో ఉన్న పలువురు ఇద్దరు డ్రైవర్లను శాంతింప‌జేసే ప్రయత్నం చేశారు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత అటుగా వ‌స్తున్న వాహ‌నాలు అప్ర‌మ‌త్త‌మై వెంట‌నే బ్రేకులు వేయ‌డంతో మ‌రింత ప్ర‌మాదం త‌ప్పింద‌ని అటుగా వెళ్తున్న వారు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డి చేరుకున్న విక్టోరియా పోలీసులు  నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డంతో పాటు డ్రైవ‌ర్ పై క‌త్తితో దాడి చేసిన 50 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. 

click me!