అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి: పోలీసుల కాల్పుల్లో నిందితుడి మృతి

Published : Aug 26, 2021, 09:44 AM ISTUpdated : Aug 26, 2021, 09:51 AM IST
అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి: పోలీసుల కాల్పుల్లో నిందితుడి మృతి

సారాంశం

అమెరికాలోని వాషింగ్టన్ లో బుధవారం నాడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయమై ఆరా తీస్తున్నారు.

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌లో బుధవారం నాడు రాత్రి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.తూర్పు వాషింగ్టన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనుమానితుడు మరణించాడు.వాషింగ్టన్ లోని ఫిన్లీలో బుధవారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది. 

 

అనుమానితుడు ఉపయోగించిన ట్రక్కు పశ్చిమ రిచ్‌ల్యాండ్ లో లభించింది. వాహనం లోపల నుండి కాల్పులు జరిపినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టుగా కెన్నెవిక్ పోలీస్ కెప్టెన్ ఆరోన్ క్లెమ్ చెప్పారు.

నిందితుడు ఉపయోగించిన ట్రక్కులో పేలుడు పదార్ధాలున్నాయని  పోలీసులు తెలిపారు. కాలిపోయిన ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై విచారణ సాగుతుందని కెన్నెవిక్ పోలీసులు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..