కాబూల్ మిషన్ ను ఆగష్టు 31 వరకు పూర్తి చేస్తాం: బ్రిటన్

Published : Aug 25, 2021, 05:10 PM IST
కాబూల్ మిషన్ ను ఆగష్టు 31 వరకు పూర్తి చేస్తాం: బ్రిటన్

సారాంశం

కాబూల్ మిషన్ ను ఆగష్టు 31 వరకు పూర్తి చేస్తామని బ్రిటన్ ప్రకటించింది. ఆఫ్ఘన్ నుండి పౌరులు, సామాగ్రి యుద్ధ విమానాల తరలింపు విషయంలో కచ్చితమైన టైమ్ లైన్ ఇవ్వలేమని ఆయన చెప్పారు.  

లండన్: ఆగష్టు 31 నాటికి కాబూల్ మిషన్ ను పూర్తి చేస్తామని బ్రిటన్  విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్ రాజ్ చెప్పారు. ఈ నెలాఖరు వరకు తమ సైనిక బలగాలను  ఈ నెలాఖరువరకు తరలిస్తామని మంత్రి తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్ నుండి పౌరులు, సామాగ్రి, యుద్ధ విమానాల తరలింపు విషయమై కచ్చితమైన టైమ్ లైన్ ఇవ్వలేమని ఆయన తెలిపారు. మిషన్ కాబూల్ మాత్రం ఆగష్టు 31తో పూర్తి కానుందని చెప్పారు.

తమ దేశ పౌరులు, సామాగ్రిని కాబూల్ నుండి ఉపసంహరించుకొనేందుకు  కొంత సమయం పడుతుందన్నారు. ఇప్పటివరకు  9 వేల మంది బ్రిటిష్ పౌరులతో పాటు ప్రమాదంలో ఉన్న ఆఫ్గన్ వాసులను అక్కడి నుండి తరలించినట్టుగా ఆయన తెలిపారు.

తమకు ఉన్న సమయాన్ని సైన్యంతో పాటు తమ పౌరులను  ఆఫ్ఘనిస్తాన్ నుండి తరలించేందుకు వినియోగించుకొంటామన్నారు. 

ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు  స్వాధీనం చేసుకొన్న తర్వాత   ఆగస్టు 31 లోపుగా  సైన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని  తాలిబన్లు  హెచ్చరించారు.  తాము విధించిన డెడ్‌లైన్ తర్వాత ఒక్క రోజు కూడ ఉపేక్షించబోమని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు.

తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారులకు డీజీపీ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీలుగా ఉన్న నలుగురిని డీజీపీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే