లాహోర్ లో బాంబు పేలుళ్లు... ఐదుగురు మృతి

Published : May 08, 2019, 10:11 AM ISTUpdated : May 08, 2019, 11:53 AM IST
లాహోర్ లో బాంబు పేలుళ్లు... ఐదుగురు మృతి

సారాంశం

పాకిస్థాన్ లోని లాహోర్ లో మరోసారి బాంబు కలకలం రేగింది. లాహోర్ లోని సుఫీ ష్రైన్ వద్ద బుధవారం ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి.


పాకిస్థాన్ లోని లాహోర్ లో మరోసారి బాంబు కలకలం రేగింది. లాహోర్ లోని సుఫీ ష్రైన్ వద్ద బుధవారం ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో మొదట నలుగురు మృతి చెందినట్లు అధికాకరులు తెలపగా.. ప్రస్తుతం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో పలువురు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ పేలుళ్ల ఘటనపై పాకిస్థానీ పోలీసులు స్పందించారు. భద్రతా సిబ్బందిని టార్గెట్ చేసుకొని ఈ బాంబు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

భద్రతా సిబ్బందిని టార్గెట్ చేస్తూ... ఈ దాడులు చేసినట్లు అధికారులు గుర్తించారు. 2010లో  ఇదే ప్రాంతంలలో సూసైడ్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో 40మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..