పాకిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం..

By SumaBala Bukka  |  First Published Feb 17, 2024, 9:31 AM IST

వారం తేడాతో పాకిస్తాన్ లో మరో భూకంపం భయాందోళనలు కలిగిస్తోంది. శనివారం ఉదయం 4.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. 


ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో శనివారం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఎన్‌సిఎస్ ప్రకారం, మధ్యరాత్రి 12:57 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం లోతు 190 కిలోమీటర్లుగా నమోదైనట్లు ఎన్ సిఎస్ తెలిపింది.

Xలోని ఒక పోస్ట్‌లో, ఎన్‌సిఎస్ ఇలా పేర్కొంది, "భూకంపం తీవ్రత: 4.7, 17-02-2024న సంభవించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో పాకిస్తాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. 2005లో పాకిస్తాన్లో వెలుగు చూసిన భూకంపంలో 74 వేల మందికి పైగా చనిపోయారు. 

Latest Videos

undefined

Alexei Navalny : రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నవల్నీ జైలులో మృతి

కాగా, గత శనివారం రాత్రి కూడా పాకిస్తాన్లో భూకంపం వెలుగు చూసింది. పాకిస్థాన్లోని అనేక నగరాలు ఈ భూకంపంతో వణికి పోయాయి. రాజధాని ఇస్లామాబాద్, పెషవర్, లాహోర్లలో భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గత శనివారం సంభవించిన భూకంపం తీవ్రత పాకిస్తాన్ వాతావరణ విభాగం ప్రకారం 4.9 తీవ్రతతో నమోదయింది. ఆ సమయంలో ఈ భూకంప లోతు 142 కిలోమీటర్లు గా గుర్తించారు. భూకంప కేంద్రం హిందూ కుష్ ప్రాంతమని నమోదయింది.

గత శనివారం రాత్రి పాకిస్తాన్లో సంభవించిన భూకంపం నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో కూడా ఉంది. ఈ భూకంపం కారణంగా పెషావర్, స్వాత్, చిత్రాల్ ఆ పరిసర ప్రాంతాలు భూకంప ప్రభావానికి లోనయ్యాయి. దీనివల్ల కాబూల్ నుంచి ఇస్లామాబాద్ వరకు భవనాలు కంపించాయని సమాచారం. 

click me!