
ఉజ్బెకిస్థాన్‌లో ఓ హృదయ విదారకమైన సంఘటన వెలుగు చూసింది. తాష్కెంట్‌కు చెందిన ఓ మహిళా లిఫ్ట్‌లో నరకయాతన అనుభవించి.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. కానీ.. ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి.. లిఫ్ట్ నుంచి బయట పడటానికి శాయశక్తుల ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె ఆక్రందనలు మిన్నంటాయి. ఆమె సహయం చేయాలని ఎంత అరిచినా.. ఆమె గొంతు ఎవరికీ వినిపించలేదు. అరిచి.. అరిచి మూగబోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రోజుల పాటు లిఫ్ట్‌లోనే ఇరుక్కుని నరకయాతన అనుభవించింది. ఆమె ఎంతటి భయకర పరిస్థితులను ఎదుర్కొందో.. ఎలాంటి బాధను అనుభవించిందో మాటాల్లోగానీ.. అక్షరాల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఆమె చివరి క్షణాలకు పోస్టు మార్టం నివేదికలే సాక్ష్యంగా నిలిచాయి.
అంతర్జాతీయం మీడియా సంస్థల కథనం ప్రకారం.. ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ చెందిన ఓల్గా లియోన్ టేవా(32) అనే మహిళ పోస్టు ఉమన్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగానే విధుల నిర్వహణలో భాగంగా ఓ తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ లోకి వెళ్లింది. అయితే.. ఆమె అందజేయాల్సినవి చివరిలో ఫ్లోర్ లో ఇవ్వాలి.. దీంతో ఆమె లిఫ్ట్‌లో పైకి వెళ్లింది. ఏమైందో తెలియదు కానీ.. లిఫ్ట్ సడెన్‌గా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించిన లిఫ్ట్ డోర్స్ తెరుచుకోలేదు. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
సాయం చేసేందుకు ఎవరైనా వస్తారేమోననీ ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ, ఆమె ఆశలు కల్లలయ్యాయి. సమయం గడుస్తున్నా.. సాయం చేయడానికి ఎవరూ రాలేదు. లిఫ్ట్ ను తెరవడానికి ఎవరూ ప్రత్నించలేదు. భయంతో ఎంతగానో అరిచింది. కానీ ఫలితం లేకుండా లేకపోయింది. ఆమె ఆక్రందనలు ఎవరికీ వినిపించలేదు. మరోవైపు.. సమయం గడుస్తున్న కొద్దీ లిఫ్ట్ లో ఆక్సీజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. దీంతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఆమె తన ప్రాణాలకు రక్షించుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నించింది. చివరికి లిప్ట్ లో శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయింది.
మరోవైపు.. జులై 24న ఆఫీస్ కు వెళ్లిన ఓల్గా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేసినా పోలీసులకు మూడు రోజుల తర్వాత ఆమె మృతదేహం లిఫ్ట్ లో లభ్యమైంది. ఆమె డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్టులో నిర్గాంతపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమె తన చివరి క్షణాల్లో ఎంతో నరకయాతన అనుభవించిందనీ, అరిచి.. అరిచి స్రుహా కోల్పోయిందనీ,చివరికి ఊపిరి ఆడక, తీవ్ర ఆందోళన, భయం నడుమ తుది శ్వాస విడిచినట్లు పోస్టుమార్టం నివేదికలు తెలిపాయి. అయితే.. ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కుని మూడు రోజులైనా లిఫ్ట్ ఎందుకు వాడకుండా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ప్రమాదమా? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.