Whatsapp: అమ్మాయిలకు వాట్సాప్‌‌లో 'హార్ట్ ఎమోజీ' పంపితే.. ఇక కటకటాలు తప్పవు 

By Rajesh Karampoori  |  First Published Aug 1, 2023, 5:28 PM IST

Whatsapp: సౌదీ అరేబియా, కువైట్‌లో వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపడం చట్టం ప్రకారం శిక్షార్హం.  హార్ట్ ఎమోజీని పంపిన వారిని నేరస్థులుగా పరిగణిస్తారనీ, ఆ చర్యను వేధింపుల చర్యగా పరిగణించి, తీవ్రమైన శిక్షలను ఎదుర్కొంటారని సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది. 
 


Whatsapp: మనలో చాలా మందికి చట్టాలపై అవగాహన లేదు. వాటి గురించి తెలియకపోవడంతో చిక్కుల్లో పడుతుంటాం.. కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే జైలు శిక్ష అనుభవించాల్సి రావచ్చు. అలాంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం.  సౌదీ అరేబియా, కువైట్‌లో వాట్సాప్ లేదా మరేదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు గుండె (heart) ఎమోజీని పంపడం చట్టం ప్రకారం శిక్షార్హం.  హార్ట్ ఎమోజీని పంపిన వారు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది. 

మీడియా కథనాల ప్రకారం.. వాట్సాప్ లేదా మరేదైనా సోషల్ మీడియా సైట్ ద్వారా అమ్మాయికి హార్ట్ ఎమోజీని పంపితే.. సదరు వ్యక్తి కఠినంగా శిక్షించబడతాడు. ఈ చర్య "వేధింపు"గా పరిగణించబడుతుంది. సదరు వ్యక్తిని నేరస్థులుగా పరిగణిస్తారు. ఈ కఠిన నియమాలను తమ దేశంలో అమల్లోకి తీసుకవచ్చినట్టు సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది. ఈ విషయాన్ని  నేరంగా పరిగణిస్తున్నారు. ఎవరైనా అలాంటి పని చేస్తే గరిష్టంగా 2,000 కువైట్ దినార్ల జరిమానా విధిస్తున్నట్టు తెలుస్తోంది.   

Latest Videos

undefined

జైలు శిక్ష,జరిమానా

కువైట్‌లోని ఒక అమ్మాయికి హార్ట్ ఎమోజీని పంపితే సదరు వ్యక్తికి 2,000 కువైట్ దినార్ల జరిమానా విధించబడుతుంది. అలాగే సౌదీలో ఒక అమ్మాయికి హార్ట్ ఎమోజీని పంపితే 100,000  (రూ.21,93,441) సౌదీ రియాల్స్ జరిమానా, అలాగే.. 2 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. పునరావృతం చేసే లేదా ఆ నిందితుడికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 300,000 సౌదీ రియాల్స్  (రూ.65,80,324) వరకు జరిమానా విధించబడుతుంది.  అందువల్ల ఆ దేశాల వారితో చాట్ చేసేవారు.. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శిక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

click me!