
ఢాకా: Bangladesh లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. నౌకలో చోటు చేసుకొన్న fire accident ప్రమాదంలో 32 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు.ఝలోకరి ప్రాంతంలో సుగంధ నదిపై ఈ ఘటన చోటు చేసుకొంది.
మూడంతస్తుల ప్రయాణీకుల నౌకలో శుక్రవారం నాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అయితే ఈ సమయంలో ప్రాణాలు కాపాడుకొనేందుకు కొందరు నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకొని 32 మంది సజీవ దహనమైనట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కి.మీ దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది.మూడంతస్తుల ఓబిజాన్ నది మధ్యలో మంటలు చెలరేగాయి. ఇప్పటికే 32 మంది మృతదేహలను వెలికి తీశారు.
సుమారు 100 మంది క్షతగాత్రులను బారిసాల్‌లోని ఆసుపత్రులకు పంపినట్టుగా పోలీస్ అధికారి తెలిపారు.170 మిలియన్ల జనాభా ఉన్న దేశంలోషిఫ్ యార్డుల్లో భద్రతా ప్రమాణాలు పేలవంగా ఉంటాయనే విమర్శలు లేకపోలేదు.మరో వైపు బంగ్లాదేశ్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. జూలైలో ఢాకాకు సమీపంలోని రూప్‌గంజ్ లో ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 52 మంది మరణించారు.
రసాయనాలను అక్రమంగా నిల్వ ఉంచిన ఢాకా అపార్ట్‌మెంట్ లో మంటలు చెలరేగిన ఘటనలో 70 మంది మరణించారు. ఈ ఘటన 2019లో చోటు చేసుకొంది. ఈ ఏడాది ఆగష్టు మాసంలో ఓ సరస్సులో పడవ , ఇసుకతో నిండిన కార్గో షిప్ ఢీకొనడంతో 21 మంది మరణించారు. బిజోయ్ నగరానికి సమీపంలో కార్గోషిప్ స్టీల్ బోటును ఢీకొన్న సమయంలో పడవలో 60 మంది ఉన్నారు.
ఏప్రిల్, మే మాసాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 54 మంది మరణించారు.గత ఏడాది జూన్ లో ఢాకాలోని ఒక ఫెర్రీని వెనుక నుండి మరో ఫెర్రీ ఢీకొనడంతో 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో రద్దీగా ఉండే ఓడ కార్గో నౌకను ఢీకొనడంతో 78 మంది మరణించారు.