శుభ‌వార్త‌.. Omicron ముప్పు త‌క్కువే.. తాజా అధ్యయనాలలో వెల్లడి!

By Rajesh KFirst Published Dec 23, 2021, 1:05 PM IST
Highlights

 ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ..  మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం తక్కువ మందికే ఉంటుందని , అలాగే.. ఆసుపత్రిలో కచ్చితంగా చికిత్స అవసరమయ్యే వారి సంఖ్యలో దాదాపు మూడింట రెండొంతుల తగ్గింపు ఉందని ప‌లు అధ్యాయనాలు వెల్ల‌డయ్యాయి. ఈ వేరియంట్ ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే ఆందోళన మాత్రం అలాగే కొనసాగుతోంది.
 

ప్ర‌పంచ వ్యాప్తంగా.. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా చుట్టేస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చినా ఈ వేరియంట్ వారాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త్ లో కూడా వ్యాపించింది. కరోనా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. మ‌న దేశం దాదాపు 230 కేసుల‌కు పైగా  న‌మోదుఅయ్యింది. అయితే.. ఈ  వేరియంట్ పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో.. లేనిపోని అపోహాలు పెరుగుతున్నాయి. 

ఈ క్ర‌మంలో అమెరికా వైద్యులు, బ్రిటిష్ వైద్య బృందం   ఒమిక్రాన్ పై లోతైన అధ్యాయ‌నాలు చేశాయి.  ఈ అధ్యాయ‌నాలు  కీల‌క అంశాల‌ను వెల్ల‌డించాయి. ఈ స్ట‌డీ ప్ర‌కారం.. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ..  మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌తో ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం తక్కువ మందికే ఉంటుందని , అలాగే.. ఆసుపత్రిలో కచ్చితంగా చికిత్స అవసరమయ్యే వారి సంఖ్యలో దాదాపు మూడింట రెండొంతుల తగ్గింపు ఉందని అమెరికా పరిశోధకులు తెలిపారు. కేసులు కూడా తక్కువే నమోదు అవుతున్నాయని, కానీ కొంతమంది వృద్ధులకు దీనివల్ల ముప్పు పొంచి ఉందని అధ్యయనంలో తేలింది.

Read Also:  భార‌త ఐటీ నిపుణుల‌కు ఊర‌ట‌.. పాత విధానంలోనే H-1B visa జారీ

బ్రిటిష్ అధ్యయనాలు కూడా ఇలాంటి ఫ‌లితాల‌ను వెల్లడించాయి.  డెల్టా వేరియంట్ తో పోలిస్తే కరోనా ఒమిక్రాన్ రకంలో ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు  తేల్చారు. ఒమిక్రాన్ కారణంగా వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వేగంగా వ్యాప్తి చెందడంతోపాటు.. టీకాలకు దొరక్కుండా తప్పించుకోగలదని గుర్తించారు. భారీగా వచ్చి పడే కేసులతో ఆసుపత్రులలో రద్దీకి దారితీయవచ్చని అంచనా వేస్తున్నారు. 

Read Also: శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

ప్రస్తుతం ఉనికిలో ఉన్న, గతంలో వచ్చిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల ఆసుపత్రి చికిత్స అవసరమయ్యే అవకాశం 70 నుంచి 80 శాతం తక్కువగానే ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఈ వేరియంట్‌తో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య దాదాపు 30 నుంచి 70 శాతం తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. 
మరో పరిశోధన ప్రకారం.. ఒమిక్రాన్ రకంలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం డెల్టాతో పోలిస్తే మూడింట రెండొంతులు తక్కువగా ఉంటుందని తేలింది. రోగనిరోధక శక్తి వల్ల ఒమిక్రాన్‌తో అత్యవసర చికిత్స పొందే వారు ఒకటి కంటే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన అవ‌స‌ర‌ముంటుంద‌ని అన్నారు. వారి శాతం 40 శాతం తగ్గినట్లు ఇంపీరియల్ కాలేజ్ అధ్యయనం తెలుపుతోంది.  

Read Also:Dhanush Telugu Movie : మొన్న శేఖర్ కమ్ముల..ఇప్పుడు త్రివిక్రమ్.. తెలుగులో ధనుష్ వరుస సినిమాలు...

ఈ క్రమంలో  వండర్ బిల్ట్ యూనివర్సిటీ బయోకెమిస్ట్ మాన్యుయేల్ ఆస్కానో తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించడమే శ్రేయ‌స్సు క‌ర‌మ‌ని అభిప్రాయపడ్డారు.  కింగ్స్ కాలేజ్ లండన్‌లోని ఫార్మాస్యూటికల్ మెడిసిన్ ప్రొఫెసర్ పెన్నీ వార్డ్ మాట్లాడుతూ.. ఈ వేరియంట్  ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్నా.. కమ్యూనిటీ ట్రాన్ లేష‌న్ వ‌ల్ల ఈ వేరియంట్ వ్యాప్తి  పెరుగుతుందనీ,  COVID కోసం ఆసుపత్రి లో చేరేవారి సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చరించారు.

click me!