సౌదీ వైమానికదాడి: 31 మంది పౌరుల మృతి

Published : Feb 16, 2020, 07:25 AM IST
సౌదీ వైమానికదాడి: 31 మంది పౌరుల మృతి

సారాంశం

సౌదీ వైమానిక దాడిలో 31 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. హౌతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని సౌదీ ఈ దాడికి దిగింది.


యెమన్: సౌదీ నేతృత్వంలోని దళాలు యెమెన్ పై విమానాలతో దాడికి దిగాయి. జెట్ విమానాన్ని కూల్చడంతో 31 మంది పౌరులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి కూడ ఈ విషయాన్ని ధృవీకరించింది.

హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేశారు. ఈ ఘటన జరగడానికి ముందు రోజే యెమెన్ లో సౌదీకి చెందిన జెట్ విమానం కూలిపోయింది.

ఈ విమానాన్ని తామే కూల్చి వేసినట్టుగా హౌతి తిరుగుబాటుదారులు ప్రకటించారరు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని భావిస్తున్నారు. ఈ దాడుల  గురించి సౌదీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే